YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరెస్టు

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరెస్టు

జగిత్యాల అక్టోబ‌రు 23, 
జగిత్యాలలో రైతులు తలపెట్టిన మహాధర్నా నేపధ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని పోలీసులు హౌజ్ అరెస్టు చేసారు.  జీవన్ రెడ్డి మాట్లాడుతతూ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు తోడు దొంగలుగా రైతులకు ఇబ్బందులు పెడుతున్నారు. సన్నపు రకం వడ్లు వేసిన రైతులకు ఇవాళ 20 నుండి 25 క్వీన్టల్ మాత్రమే దిగుబడి వస్తుంది అదే దొడ్డు రకం వడ్లు వస్తే 30 క్వీన్టల్ దిగుబడి వచ్చేది.  ఈ రోజు రైతులు 10 వేల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.  ఇది ప్రకృతి చేసిన నష్టం కాదు ఇది పూర్తిగా మ్యాన్ మెడ్ మిస్టేక్. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి ఆలోచనలు సూచనలతో ఈ సన్నారకాలు తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్  కేవలం  వర్తక వాణిజ్య వర్గాలకు లాభం చేయాలని ఉద్దేశంతో చేసారు. రైతుల కడుపు కాలి ఇవాళ రైతులు రోడ్డుకు ఎక్కితే అర్థ రాత్రి అరెస్టులు చేస్తారా ? ఇదేనా ప్రజాస్వామ్యం ఇందుకేనా కోరుకున్నది తెలంగాణ రాష్ట్రం. రైస్ మిల్లర్లతో కుమ్మకైన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులకు స్వేచ్ఛ ఉంటుందని భావిస్తే చరిత్రలో ఉన్న  పూర్వపు నైజం కాలం బెట్టర్ అనిపిస్తుందని అయన అన్నారు.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కుఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేసి కనీసం మద్దతు ధర 1850 చెల్లించి సన్నపు రకం వడ్లను 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని అయన అన్నారు.

Related Posts