
హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం మొదలయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందేమో అని భయం పట్టుకుంది. 12 పేజీల లేఖ రాశావు.. అదే కమిషన్ ముందు వెళ్లి చెప్పుకోవచ్చు కదా. తప్పు చేయకపోతే... కమిషన్ ముందు నిరూపించుకో . విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం . అక్రమాలు బయటకు రావాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. కేసీఆర్ విచారణకు సహకరించాలని అన్నారు.