YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

నయా స్ట్రాటజీతో టీ కమలం

నయా స్ట్రాటజీతో టీ కమలం

తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీతో ముందుకు వెళుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కంటే తామే రేసులో ముందున్నామన్న సంకేతాలను అయితే పంపగడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల్లో రేపు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది పక్కన పెడితే ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ ను బీజేపీ వెనక్కు నెట్టేసిందనే చెప్పాలి. టీఆర్ఎస్ తో ధీటుగా తలపడతామని క్యాడర్ లో విశ్వాసం అయితే నాయకత్వం నింపగలిగిందనే చెప్పాలి.ఇదే దూకుడును గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ చూపాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేయగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నగరంలో పట్టు కోల్పోకుండా ఉండగలుగుతుందని భావిస్తున్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆరుగురు అధ్యక్షులను నియమించి వారిచేత పనులను ఇప్పటికే ప్రారంభించింది.ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమయిన సంగతి తెలిసిందే. అన్ని బస్తీలు నీటమునిగాయి. కాలనీల్లో సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి కాలనీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగా నియమించిన ఆరుగురు అధ్యక్షులను ఆదేశించారు. ఎప్పుడు ఏ కాలనీలో పర్యటించాలో చెప్పాలని కిషన్ రెడ్డి కార్యాలయం కోరిందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకే బీజేపీ వార్డుల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది.ఇక ఎంఐఎం ముక్త్ హైదరాబాద్ నినాదంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వెళ్లనుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో అంటకాగుతూ హిందువులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఎంఐఎంను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ స్థానాలను పొందవచ్చన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇప్పటికే నలభై స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని దక్కించుకోగలిగితే తమకు హైదరాబాద్ లో పట్టుదొరుకుంతుందని బీజేపీ భావిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts