YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఆసక్తికరంగా గ్రేటర్ పోరు

ఆసక్తికరంగా గ్రేటర్ పోరు

 గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు వేగం చేయడంతో ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్ ఆశావహులు ఈసారి తనకే టికెట్లు లభిస్తుందని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలు తనకు అనుకూలంగా ఉన్నారని, డివిజన్‌లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారని, మీరంతా నావెంటనే ఉండాలని అనుచరులను కోరుతున్నారు. జనవరిలో ఎన్నికల పోరు జరుగుతుందని ఇప్పటి నుంచే ప్రజలను కలిసేందుకు స్థానికంగా ఉండే బస్తీ, కాలనీ సంఘాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. గ్రేటర్‌లో 150 కార్పొరేట్ డివిజన్లుండగా, ప్రతి పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థ్దులతో కూడిన జాబితా తయారు చేసుకున్నట్లు, ఎన్నికల నోటిఫికేషన్ వెల్లువడగానే బలమైన అభ్యర్థిని ఎంపిక చేసి బరిలో దించేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.కానీ ఆశావహులు మాత్రం తనకే ఖచ్చితంగా బీఫారం వస్తుందని అనుచరులతో కరాకండీగా చెబుతూ ప్రత్యర్థులను తికమక పెట్టిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలో సమరంలో అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం తలపడనున్నాయి. గడిచిన ఎన్నికల్లో గులాబీ పార్టీ ఊహించని విధంగా 99 సీట్లు తమ ఖాతాలో వేసుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అదే తరహాలో ఈసారి జరిగే ఎన్నికల్లో కూడ ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ మరోసారి గ్రేటర్‌పై జెండా ఎగురవేసేందుకు ఆపార్టీ నగర నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. హస్తం, కాషాయం పార్టీలకు చెందిన అసంతృప్తి నేతలకు పార్టీ కండువా కప్పుతున్నారు. ప్రజలు మావైపు ఉన్నారని విపక్షాలు అధికారం కోస కలలు కడగడం తప్ప మరో మార్గం లేదని ఎద్దేవా చేస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ పోరులో మేయర్ కుర్చీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తుకు, పైఎత్తులు వేస్తూ కార్పొరేటర్‌గా ప్రజాబలం, ధనం బలమున్న నేతల కోసం జల్లెడ పడుతున్నారు.ఇప్పటికే కొంత మందిని గుట్టుచప్పుడు ప్రచారం చేసుకోవాలని సమాచారం ఇచ్చినట్లు, వారంతా కుల సంఘాలను నాయకులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఒక డివిజన్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు తానే పోటీ చేస్తున్నట్లు అనుచరులతో చెబుతున్నారు. వీరికంటే తామేమి తక్కువ కాదని కమలనాథులు కూడా పలు డివిజన్లలో ప్రచారం చేసుకోవాలని చురుకైన నాయకులకు సూచించినట్లు, కొన్నిచోట్ల నియోజకవర్గాల బాధ్యులు కూడా తమకు అనుకూలమైన నాయకుని ఓట్ల వేటలో పడ్డాలని పేర్కొనడంతో వారు కూడా ఎన్నికల రంగానికి సిద్ధ్దమైతున్నట్లు స్థానిక కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. తాము ఎవరి వెంటనే ఉండాల్లో అర్దంకాక తలపట్టుకుంటున్నామని, పార్టీ అభ్యర్దులను ప్రకటించేవరకు ఎవరు కార్పొరేటర్ అభ్యర్దులమని ప్రచారం చేసుకోకుండా కట్టడి చేయాలని సీనియర్లను కోరుతున్నారు. అభ్యర్దుల మధ్య పోటీ ఉంటే కుల సమీకరణాలతో మరొకరికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉండదని, వారి ఏవిధంగా సర్దుబాటు చేయాల్లో పార్టీ పెద్దలకు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. గ్రేటర్ పోరు ఈసారి రసవత్తరంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related Posts