YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

రెండంచల వ్యూహంతో కమలం

రెండంచల వ్యూహంతో కమలం

పశ్చిమ బెంగాల్ ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ అన్ని రకాలుగా వ్యూహం రచిస్తోంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ని వీక్ చేసేందుకు ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీలను బీజేపీ మారుస్తూ వెళుతోంది. ఇప్పటికే తరచూ బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించి అక్కడ మరింత వేడెక్కించారు.పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పై అసంతృప్తి ఉందని బీజేపీ గట్టిగా భావిస్తుంది. టీఎంసీ వ్యతిరేక ఓటు చీలిపోతే మమత బెనర్జీ లబ్ది పొందుతుందని తెలుసు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్, వామపక్షాలు బలం పెంచుకోకుండా చూసేందుకే బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.రెండు పార్టీలు బలోపేతం అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఫలితంగా మరోసారి మమత బెనర్జీకి ప్రయోజనం చేకూరుతుంది. అందుకే కాంగ్రెస్, వామపక్షాలను పోటీ లో లేకుండా చేసేందుకే బీజేపీ ఎక్కువగా ప్రయత్నిస్తుంది. అందుకే గత రెండేళ్ల నుంచి బీజేపీ నేతలు తరచూ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తూ క్యాడర్ ను ఉత్తేజపరుస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు బలంగా ఉన్న చోట ప్రధానంగా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.బీజేపీ దీనిపై పూర్తి స్థాయి కసరత్తు చేసింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ను వీక్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. టీఎంసీ నుంచి ముఖ్యమైన నేతలను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో పాటు తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఆరుగురు కేంద్ర మంత్రులకు కీలక బాధ్యతలను బీజేపీ కేంద్ర నాయకత్వం అప్పగించింది. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ ముండా, ప్రహ్లాద్ పటేల్, సంజీవ్ బలియన్, నిత్యానంద రాయ్, మన్సుక్ మాండవ్యాలను వివిధ లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జిలుగా నియమించింది. వీరు తరచూ ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసేంత వరకూ ఈ ఆరుగురు ఇన్ ఛార్జులుగా కొనసాగుతారు.

Related Posts