YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

ఇంకా డ్రామాలతోనే రాహుల్

ఇంకా డ్రామాలతోనే రాహుల్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఏఐసీసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడెవరో తేల్చనున్నారు. సహజంగా తిరిగి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపడతారని అందరికీ తెలిసిందే. కానీ వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా డ్రామాలను వదిలిపెట్టడం లేదు. రాహుల్ తనంతట తానుగా పదవిలోకి రాలేదన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ తో పాటు మరికొందరు అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు.2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర అపజయాన్ని చవి చూసిన తర్వాత రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎందరు నచ్చ చెప్పినా పదవిని స్పీకరించడానికి ఇష్టపడలేదు. దీంతో తిరిగి సోనియా గాంధీనే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఇప్పుడు తిరిగి కొత్త అధ్యక్షుడు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాటు సీనియర్ నేతలు కూడా ఇటీవల తమ లేఖలతో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.రాహుల్ గాంధీ పదవి చేపట్టకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. సీనియర్ల పెత్తనాన్ని రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదు. నిర్ణయాలను తీసుకునే విషయంలో తనకు స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తల్లి సోనియా ను ఇన్ ఫ్లూయెన్స్ చేస్తుండటంతో సీనియర్ నేతలను తప్పించాలని రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఆయన అనుకున్నట్లుగానే సీనియర్ నేతలు లేఖలు రాసి పార్టీ పట్ల అసంతృప్త వాదులుగా ముద్రపడిపోయారు.తాను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలంటే సీనియర్లు పక్కకు తప్పుకోవాల్సిందేనని రాహుల్ గాంధీ కండిషన్ పెడుతున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు కూడా అంగీకరించినట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి రావాలంటే తన వ్యూహం తనకు ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలిసింది. రాహుల్ ప్రత్యేకంగా తన కోటరీతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఎట్టకేలకు సీనియర్ నేతలు అంగీకరించడంతో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

Related Posts