YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ డిమాండ్

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ బహిరంగ  క్షమాపణ చెప్పాలి   బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ డిమాండ్

హైదరాబాద్ డిసెంబర్ 28  
డిసెంబర్ తెలంగాణ ముఖ్యమంత్రి మరొకసారి తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అనుభవంతో చూపించాడని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు.వ్యవసాయ చట్టాలపైన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. గత నాలుగు నెలలుగా కేసీఆర్ వ్యవసాయ  చట్టాలపై చేసిన విమర్శలు మార్చుకొని కొత్త చట్టాలకు కితాబు ఇవ్వడాన్ని బిజెపి స్వాగతిస్తోందన్నారు.మేం గత సంవత్సర కాలం నుంచి  నియంత్రిత సాగుచెయ్యడం తప్పని.. ఈ పద్ధతి ద్వారా రైతులు మరింత నష్టపోతారని, రైతులు వేసుకునే  పంటలకు స్వేచ్ఛనివ్వాలని ఎన్నిసార్లు  చెప్పినా కేసీఆర్ నియంతృత్వ  పోకడల ముందు  మా రోదన అరణ్యరోదనే అయ్యిందని,నియంత్రిత సాగువల్ల తెలంగాణ  రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటువంటి నియంతృత్వపు ఆలోచన ద్వారా తెలంగాణ రైతాంగానికి నష్టంచేసినందుకు కేసీఆర్ బహిరంగ  క్షమాపణ చెప్పాలని డిమాడ్ చేసారు.అయితే ఇప్పటికైనా కేసీఆర్ కళ్లుతెరచి కేంద్రం, భారత పార్లమెంట్ ఆమోదించిన  వ్యవసాయ చట్టాలను  తెలంగాణలో అమలు చేసేందుకు సంకేతాలు  ఇచ్చినందుకు సంతోషం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో  రైతులకు మరింత లాభం చేకూర్చడానికి అనేక చర్యలు తీసుకోవాలని గతంలో చెప్పాం.. ఇప్పుడు కూడా చెబుతున్నాం.2014లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  గారు దేశంలోని  ప్రతి ఎకరా భూమికి భూసార పరీక్షలు నిర్వహించి, ఆభూమికి అనువైన  పంటలను  వేసుకునేందుకు రైతులకు అవగాహన  కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర  ప్రభుత్వాలదే.. ఈ విషయంపై  మేం నెత్తీనోరు కొట్టుకున్నా తెలంగాణలో భూసార  పరీక్షలు నిర్వహించకుండా కేసీఆర్..  రైతులను నట్టేట ముంచిండు. రైతులకు అవగాహన  కల్పించాల్సిన వ్యవసాయ విస్తరణాధికారులను, వ్యవసాయ శాఖను బలోపేతం చేయకుండా కేసీఆర్ అడ్డుకున్నారు.  వ్యవసాయ యాంత్రీకరణ,  సూక్ష్మసేద్యం, విత్తనాలకు, పంటల బీమాకు  కేంద్రం సహాయం అందించినా వాటిని అమలు చేయడంలో, వాటిద్వారా తెలంగాణ రైతులకు లాభం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా  విఫలమైందని పేర్కొన్నారు.ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం భూసారపరీక్షలు మొదలుకొని మార్కెట్ యార్డుల వరకు సంస్కరించి రైతులకు నష్టం జరగకుండా  ఆదుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ  రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల  ద్వారా వడ్లతో పాటు  ఇతర ఆహార ఉత్పత్తులను  ఎంఎస్ పి రేటుకు కొనుగోలు చేయాలని మేం చాలాసార్లు డిమాండ్  చేశాం.ఈ  ఐకేపీ కేంద్రాల నిర్వహణ లోపభూయిష్టంగా  ఉందని,  కమీషన్, తరుగు పేరుతో 20 శాతం దాకా రైతులకు నష్టం జరుగుతోందని మేం గతంలో అనేక సందర్భాల్లో చెప్పినా మా మాటలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులను సంస్కరించి ఈనామ్ కు అనుసంధానం చేసి రైతులకు మెరుగైన లాభసాటి ధరను కల్పించేందుకు కృషిచేయాలి. అంతేకాని.. మొత్తం భారాన్ని కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకుంటే  ఊరుకునేది  లేదని బిజెపి హెచ్చరిస్తోందన్నారు.రైతులకు  లాభసాటి ధర  కల్పించేందుకు  రాష్ట్ర ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్  చేస్తోంది. విత్తనాలు  మొదలు అమ్మకాల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయాలని , తద్వారా రైతులకు  మేలైన విత్తనాలు సరసమైన సమకూర్చాలని కోరుతున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణాధికారుల  నియామకంతో పాటు, వారు రైతులకు పంటల విషయంలో అవగాహన కల్పించేందుకు ,  సమర్థవంతంగా పనిచేసే  ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. తెలంగాణ  రాష్ట్రంలో పత్తి, వరితో పాటు వేరుశెనగ, పొద్దుతిరుగుడు,  కందులు,  పెసళ్లు, శెనగలు, చెరకు, మిర్చి వంటి పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు  మరింత  లాభాలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలి. అంతేతప్ప.. నియంత్రిత సాగును  రద్దు చేస్తున్నాం..  ఐకేపీ సెంటర్లు రద్దు  చేస్తున్నామని చెప్పి రైతులకు లాభం చేకూర్చే విషయంలో  బాధ్యతల నుంచి తప్పుకుంటే  బిజెపి ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. దీంతోపాటు కూరగాయలు,  ఉద్యానవన పంటలను  కూడా ప్రోత్సహించేందుకు రైతులకు సబ్సిడీని సకాలంలో అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులకు ఎవ్వరు నష్టం  చేసినా చాలా  సందర్భాల్లో తగిన గుణపాఠం రైతులే చెప్పారు. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికైనా  కేసీఆర్  కళ్లు తెరిచినందుకు సంతోషం. ఇప్పటికైనా రైతులను  ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్  చేసారు

Related Posts