YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆనందంలో ఉప్పొంగిపోతున్నాడు

ఆనందంలో ఉప్పొంగిపోతున్నాడు

తాను ఎంత అదృష్టవంతుడినో అంటూ ఆనందంలో ఉప్పొంగిపోతున్నాడు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ఎన్నో రోజుల నుంచి తాను ఎదురుచూసిన తరుణం వచ్చిందని, ఆ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేనని సంబరపడిపోతున్నాడు. అయితే దేవీ శ్రీ ప్రసాద్ ఇంతలా సంబరపడిపోవడానికి కారణం ఏంటంటే.. కోలీవుడ్ లెజండ్‌లు అయిన సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరి ప్రశంసలు అందుకోవడమట.

వివరాల్లోకి వెళ్తే.. నడిగర్ సంఘం ఆధ్వర్యంలో జనవరి మొదటి వారంలో మలేషియాలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో దేవీ శ్రీ ప్రసాద్ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌ను ఇచ్చాడు. ఆ సమయంలో వేదిక ముందు వరుసలో కూర్చొన్న రజనీకాంత్, కమల్ హాసన్ దేవీ శ్రీ డ్యాన్స్ ముగిసిన వెంటనే లేచి చప్పట్లతో అభినందించారట. అంతేకాదు ఆ తరువాత అతడిని పిలిచి వారి మధ్య కూర్చోబెట్టుకొని, ఫొటో తీసుకున్నారట. ఈ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న దేవీ "ఈ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ కామెంట్ పెట్టాడు.

Related Posts