YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి

రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి

నెల్లూరు జనవరి 18 
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి హిందూ సాంప్రదాయ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక చేయూత నివ్వాలని నెల్లూరు జిల్లా బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి భారతీయుల దగ్గరకు వెళ్లి సమర్పణా నిధి సేకరించాల్సిన బాధ్యత భారతీయ ప్రతి పౌరుడికి ఉందన్నారు. సమర్పణ నిధి సేకరరణలో భాగంగా నెల్లూరు 16,17 వ డివిజన్లలో ఇల్లుల్లు తిరిగి రామమందిర నిర్మాణం పై అవగాహన కల్పిస్తూ, సమర్పణ నిధులను సమీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు కరణం భాస్కర్,నాగరాజ రెడ్డి , సాయి,మల్లికార్జున, శ్రీనివాసులు నాయుడు,  రాములు ,చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts