YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మందుబాబులకు షాకింగ్ న్యూస్...

మందుబాబులకు షాకింగ్ న్యూస్...

హైదరాబాద్ జనవరి 29 
దేశంలో జరిగే వాహన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు మందుబాబుల వల్లే జరుగుతున్నాయి. మద్యం మత్తు వల్ల కొందరు తమ ప్రాణాలను కోల్పోతుంటే మరి కొందరు అవతలి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి  కారణం అవుతున్నారు. కొత్తకొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే రాచకండ పోలీసులు మందుబాబులకు దిమ్మతిరిగే  నిర్ణయం తీసుకున్నారు.ఇకపై మందుబాబులు మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు మందుబాబులు పని చేసే ఆఫీస్ కు సమాచారం ఇవ్వనున్నారు. 10 వేల రూపాయల ఫైన్ తో పాటు 90 రోజుల పాటు లైసెన్స్ రద్దవుతుంది. తొలిసారి పట్టుబడితే ఈ శిక్షలన్నీ అమలవుతాయి. రెండోసారి మద్యం తాగి పట్టుబడితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు కావడంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష 15 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సైబరాబాద్ పరిధిలో ఈ నిబంధనలను తప్పకుండా అమలుచేస్తామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడిపే అర్హత కోల్పోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మళ్లీ ప్రారంభం కావడంతో పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాపిక్ అధికారులు మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాలు తప్పవని చెబుతున్నారు. హై కమాండ్ ఆర్డర్ల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించామని.. మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నామని వెల్లడించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుందని వాహన్దారులు ట్రాపిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.  ఇక 2019లో-1917 2020లో-2387.. రెండేండ్లలో 4304 డ్రైవింగ్ లైసెన్స్లు రద్దయినట్లు పోలీసులు చెప్పారు. మరి ఇది మందుబాబులకు షాకింగ్ న్యూసే.

Related Posts