YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేఈ మళ్లీ యాక్టివ్

కేఈ మళ్లీ యాక్టివ్

కేఈ మళ్లీ యాక్టివ్
కర్నూలు, జనవరి 30,
రాయలసీమలో రాజకీయం తెలుగుదేశం పార్టీకి సవాల్ గా మారుతోంది. మొదట్లో అంటే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాయల‌సీమ టీడీపీకి జై కొడుతూ వచ్చింది. ఎన్టీయార్ ని సీమ వాసులు తమ ప్రాంత దత్తపుత్రుడిగా భావించి ఆరాధించారు. ఇక ఎన్టీయార్ సినీ నటుడిగా ఉన్న కాలంలో కూడా రాయలసీమ కరవులో పడితే సహాయం కోసం జోలె పట్టి ఆదుకున్నారు. ఆ తరువాత ఆయన రాజకీయాల్లోనూ సీమను దగ్గరకు తీసుకున్నారు. తెలుగు గంగ పధకాన్ని కూడా నాడు ప్రారంభించారు. అనేక సాగు నీటి ప్రాజెక్టులు రామారావు టైం లో రూపు దిద్దుకున్నాయి.ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సీమలో పార్టీ బలం తగ్గింది. సీమ వాసులు ఎక్కువగా ముక్కుసూటితనాన్ని ఇస్ఠపడతారు. అలాగే దూకుడు రాజకీయాలను వారు మెచ్చుకుంటారు. బాబు ఆచీ తూచీ చేసే రాజకీయం, నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లి మొగ్గలు వేయడం వంటివి వారికి అసలు నచ్చదు, ఇక బాబును కోస్తా అల్లుడిగానే సీమ జనం అమరావతి రాజధాని ప్రకటన తరువాత నిర్ధారించేశారు. అయితే సీమలో టీడీపీకి ఇప్పటికీ కొంత బలం ఉండడానికి కారణం అక్కడ ఇతర పార్టీలలో పొసగని నాయకులకు టీడీపీ ఒక సేఫ్ జోన్ గా ఉండడమే. అలా పెద్ద రాజకీయ కుటుంబాలు కొన్ని ఇప్పటికీ టీడీపీ నీడన ఉన్నాయి.’
చంద్రబాబు 2019 ఎన్నికల ముందు కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకున్నారు. దాని వల్ల ఆయన బావుకున్నది ఏదీ లేకపోగా ముఠా తగాదాలు ఎక్కువ అయ్యాయి. అప్పటిదాకా కర్నూల్ జిల్లాలో ఆధిపత్యం చేస్తూ వచ్చిన కేఈ కృష్ణమూర్తి కుటుంబం గుస్సా అయింది. ఇక ఎన్నికల్లో ఓడాక అది మరింత బయటపడింది. ఇక కేఈ కృష్ణమూర్తి రాజకీయాల్లో చురుకుగా ఉండడంలేదు. ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ అయితే ఈ టీడీపీ మాకు వద్దు అని గత ఏడాది మార్చిలో దండం పెట్టి మరీ బయటకు వచ్చేశారు. అయితే ఆయన వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. దాంతో తాజాగా తిరిగి సొంత గూటికే వచ్చారని చెబుతున్నారు.ఇక చంద్రబాబు సైతం కాంగ్రెస్ నుంచి వచ్చిన కోట్ల ఫ్యామిలీ కంటే పార్టీని నమ్ముకుని మొదటి నుంచి ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబానికే పెద్ద పీట వేయాలని తాజాగా నిర్ణయించారని అంటున్నారు. ఇలా ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నాకనే కేఈ ప్రభాకర్ టీడీపీలో కొనసాగాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జిల్లా రాజకీయాల్లో టీడీపీ తరఫున కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడం కరెక్ట్ డెసిషన్ అని కూడా పార్టీ వారు అంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన కేఈ కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటే 2024 నాటికైనా కర్నూలు లో పార్టీ దశ తిరిగుతుందని బాబు ఆశపడుతున్నారుట. 2019 ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా టీడీపీకి రాని సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి అఖిలప్రియ మీద కేసుల కధతో భూమా కుటుంబాన్ని టీడీపీ దూరం పెట్టాలని ఆలోచిస్తున్న నేపధ్యంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి ఈ పరిణామాలు కలసివచ్చాయని అంటున్నారు. మరి ఇలా రివర్స్ గేర్ లో టీడీపీ లోకి ఎంతమంది మాజీ తమ్ముళ్ళు వస్తారో చూడాలి.

Related Posts