YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ-వాచ్ యాప్ పై హైకోర్టుకు ఎక్కిన జగన్ ప్రభుత్వం

ఈ-వాచ్ యాప్ పై హైకోర్టుకు ఎక్కిన జగన్ ప్రభుత్వం

అమరావతి ఫిబ్రవరి 3
ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్ పై జగన్ ప్రభుత్వం హైకోర్టుకు ఎక్కింది. హైకోర్టులో తాజాగా లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోహన్ నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది.ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లాంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోహన్ కు నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది.ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటీషన్ లో ప్రస్తావించింది. యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది.పంచాయితీ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడమే ధ్యేయంగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కొత్త యాప్ తీసుకొచ్చారు. జగన్ సర్కార్ ను అడ్డుకునేందుకు ఈ కొత్త ఎత్తు వేశారు. పాత యాప్ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చి ఉపయోగించాలని నిర్ణయించారు.  ఎన్నికల ఫిర్యాదులు పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేస్తున్న కాల్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు ఎక్కింది.

Related Posts