YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు దేశీయం

దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక యువతిపై లైంగిక దాడి

దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక యువతిపై లైంగిక దాడి

మహిళల భద్రతకు కేంద్రం, రాష్ట్రాలు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మహిళా పోలీసులతో పహారా కాసే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక యువతిపై లైంగిక దాడి జరుగుతున్నది దేశాన్ని కదిలించిన నిర్భయ కేసు గడిచి దశాబ్దం దాటిపోయింది. మహిళల భద్రతకు చేస్తున్న ఖర్చును చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఈ విశ్లేషణను గ్లోబల్ ఎనాలిసిస్ బాడీ - ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఢిల్లీలో కదిలే బస్సులో జరిగిన ఆ భయంకరమైన సంఘటన తరువాత.. నిర్భయ ఫండ్, హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా ఏర్పడ్డాయని సంస్థ తప తాజా నివేదికలో పేర్కొన్నది. గత మూడేండ్లుగా భారతదేశంలో సగటున మహిళల భద్రతకు రూ.30 మాత్రమే ఖర్చు చేస్తున్నారని సంస్థలోని జెండర్ జస్టిస్ నిపుణుల అధిపతి అమితా పిట్రే తెలిపారు. సుమారు 8 కోట్ల మంది మహిళలు లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. మహిళలు తమ రక్షణ కోసం రూ.102 మాత్రమే పొందుతున్నారని, ఇది ఏమాత్రం సరిపోదని నిపుణులు చెప్తున్నారు.కరోనా మహమ్మారి కారణంగా దేశంలో హింస, నిరుద్యోగం కేసులు పెరిగాయి. అయినప్పటికీ, 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం మహిళలకు స్వల్పంగా నిధులను పెంచింది. నిర్భయ నిధిని చాలా సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం సృష్టించింది, ఈ ఫండ్ దేశం జనాభాలో సగం మందికి తక్కువ కాకుండా ఉన్న 130 కోట్ల మహిళలకు సరిపోదు. లైంగికదాడులను నిలువరించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ నిధి చాలా తక్కువగా ఉండటంతో ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లను మెరుగుపరచడానికి, అత్యవసర ప్రతిస్పందన సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఫండ్ నుంచే నిధులను రాష్ట్రాలకు కేటాయించారు. దాంతో మహిళలు పెద్దగా ప్రయోజనం పొందడంలేదు.ప్రభుత్వ క్రైం డాటా ప్రకారం, 2018 లో దేశంలో 34 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీటిలో 85 శాతం కేసులు పరిష్కారమయ్యాయి. 27 శాతం కేసుల్లో మాత్రమే దోషులును నిర్ధారించారు. మహిళలకు సత్వర సహాయం కోసం దేశంలో 600 వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు పనిచేస్తున్నాయి. 'మహిళలకు స్వల్ప కాలానికి వసతి కల్పించడానికి చాలా తక్కువ కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటి కేంద్రాల అవసరం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది మహిళలు ఉన్నారు. ఈ కేంద్రాల సంఖ్యను పెంచి వసతులు కల్పించాలి' అని అసోసియేషన్ ఆఫ్ అడ్వకేసీ అండ్ లీగల్ ఇనిషియేటివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేణు మిశ్రా చెప్పారు.

Related Posts