
బెంగళూరు, జూలై 24,
ఐటి ఉద్యోగం ఎక్కడ వచ్చినా చెయ్. చివరికి పాకిస్తాన్లో వచ్చిన చేసేయ్. పొరపాటున కూడా బెంగళూరులో వస్తే మాత్రం చేయకు. తక్కువలో తక్కువ ప్యాకేజీ కోటి వరకు ఉంటేనే ఓకే. అంతకంటే తక్కువ ఉంటే మాత్రంఆస్తులు అమ్ముకోవాల్సిందే. అక్కడి అద్దెలు హద్దులు దాటిపోయాయి. న్యూయార్క్ పనికిరాదు. సింగపూర్ లెక్కలోకి రాదు. దుబాయ్ పరిశీలనలోకి రాదు. లండన్ కూడా ఈ జాబితాలో నిలబడదు” సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాను ఊపేసిన పోస్ట్ ఇది. ఇప్పుడు ఆ పోస్టును మళ్ళీ రీ పోస్ట్ చేయాలి. అంతేకాదు న్యూయార్కు, సింగపూర్, దుబాయ్, లండన్ కాకుండా ఖరీదైన నగరాల పేర్లను ఇందులో చేర్చాలి. ఎందుకంటే బెంగళూరులో అలా ఉంది పరిస్థితి.బెంగళూరు దేశ ఐటి రాజధానిగా పేరుపొందింది. ఎప్పుడైతే ఐటి పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయో.. బెంగళూరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆకాశాన్ని తాకే భవంతులు నిర్మితమయ్యాయి. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు లెక్కకు మిక్కిలిగా ఏర్పాటయ్యాయి. ఇక లివింగ్ హాస్టల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతటి స్థాయిలో అభివృద్ధి చెందిన బెంగళూరు.. ఇంటి అద్దెల విషయంలోనూ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. కొన్ని సందర్భాల్లో ఆదేశాలను కూడా వెనక్కి నడుతోంది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.. ఎందుకంటే బెంగళూరులో ఇంటి అద్దెలు తారస్థాయిని దాటిపోయాయి. అంతకుమించి అనే రేంజ్ ను కూడా అధిగమించాయి. ఐటీ పరిశ్రమలో జీతాలు ఎక్కువగా ఉండడం.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడటం.. పైగా అత్యాధునిక సదుపాయాలు ఉండడంతో చాలామంది గృహ యజమానులు అద్దెలను అమాంతం పెంచారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగి సామాజిక మాధ్యమాలలో చేసిన ఒక పోస్ట్ బెంగళూరులో ఉన్న వాస్తవ పరిస్థితిని అర్థం పడుతుంది.ఆ ఐటీ ఉద్యోగి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం..”బెంగళూరులో ఇంటి యజమానులు అత్యంత దురాశపరులు. వారి స్వార్థానికి హద్దు అనేది లేకుండా పోతోంది. ముఖ్యంగా ఇంటి అద్దెలను విపరీతంగా పెంచారు. ఐటీ ఉద్యోగులు అందులో ఉండడం కష్టంగా మారుతోంది. నేటి కాలంలో ఉద్యోగాలు కోల్పోయి.. చాలామంది ఇబ్బంది పడుతున్నప్పటికీ గృహ యజమానులు మాత్రం తమ అత్యాశను వదులుకోవడం లేదు. పైగా ఇంటి రెంట్లు ఘోరంగా పెంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి అద్దెలు చెల్లించడం కంటే అపార్ట్మెంట్లు పెట్టుకోవడం నయం అనిపిస్తోంది. తాజాగా బెంగళూరులో ఓ ప్రాంతంలో 4 బీహెచ్కే రెంట్ నెలకు 2.3 లక్షలు అడిగారు. అదే కాదు సెక్యూరిటీ డిపాజిట్ కింద 23 లక్షలు చెల్లించాలని అన్నారు. 2.3 లక్షల రెంట్ చాలా ఎక్కువ. పైగా సెక్యూరిటీ డిపాజిట్ కింద 23 లక్షలు అడగడం నిజంగా హాస్యాస్పదం. ఇది గృహ యజమానుల దురాశకు అడ్డంపడుతోంది. ఈ స్థాయిలో అద్దెలు ఎక్కడా ఉండవు. ఇంతటి అధ్యక్షులు చెల్లించి ఎలా బతకాలి. తక్కువలో తక్కువ రెండు కోట్ల ప్యాకేజీ ఉంటే తప్ప బెంగళూరులో బతకడం కష్టం. సింగపూర్, న్యూయార్క్, లండన్, దుబాయ్ ప్రాంతాలలో కూడా ఈ స్థాయిలో అద్దెలు ఉండవని” ఆ వ్యక్తి ఆ సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించడం విశేషం. ఆ వ్యక్తి చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు బెంగళూరులో ఉన్న పరిస్థితికి అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ.. రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నప్పటికీ బెంగళూరులో ఉన్న గృహ యజమానులు ఏమాత్రం తగ్గడం లేదు.