YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల్లో ఎవరు గెలిచారు

ఎన్నికల్లో ఎవరు గెలిచారు

విజయవాడ, ఫిబ్రవరి 27, 
పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేశారు. పంచాయతీల్లో ఎక్కువ స్థానాలను తామే గెలుచుకున్నామంటూ రెండు పార్టీలూ ప్రకటించుకున్నాయి. తమకు 80 శాతం పంచాయతీలు వచ్చాయని అధికార వైసీపీ అంటుంటే, తమ పార్టీ 40 శాతం పంచాయతీలను కైవసం చేసుకుందని టీడీపీ వాదిస్తుంది. ఇక వైసీపీ అయితే ఒకడుగు ముందుకు వేసి ఏకంగా ఒక వెబ్ సైట్ ను తయారు చేసి అందులో పంచాయతీలో గెలిచిన తమ మద్దతుదారుల ఫొటోలను ఉంచారు. ఇలా సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు.కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తు మీద జరిగేవే. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వైసీపీ, టీడీపీ అగ్రనేతలు సయితం రానున్నారు. అంటే హోరాహోరీ పోరు జరగనుంది. ఇరవై నెలల జగన్ పాలనపై పట్టణ ప్రజల అభిప్రాయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టం కానుంది.ఇప్పటి వరకూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని వైసీపీ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో ఎవరి సీన్ ఏంటనేది తేలిపోతుంది. ప్రభుత్వ పథకాలు పట్టణాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయన్నది స్పష్టమవుతుంది. ఇరవై నెలలుగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన జగన్ అభివృద్ధి వైపు కన్నెత్తి చూడలేదు. ఇది పట్టణ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు.ఇక ఇసుక కొరత, మద్యం ధరల పెంపు, పెట్రోలు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అదనపు ట్యాక్స్ వంటివి మున్సిపల్ ఎన్నికల్లో పనిచేస్తాయని టీడీపీ బలంగా నమ్ముతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తామే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా తమను ఆదరిస్తాయని, జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ప్రజలు బేరీజు వేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మార్చి 14వ తేదీన ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. ఇప్పటివరకూ వేసిన ముసుగులన్నీ తొలగిపోతాయి

Related Posts