YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

50 వేలు కాదు.. పే-రివిజన్ రిపోర్టు ప్రకారం లక్షా 90 వేల ఖాళీలు భర్తీ చేయాలి - జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్

50 వేలు కాదు.. పే-రివిజన్ రిపోర్టు ప్రకారం లక్షా 90 వేల ఖాళీలు భర్తీ చేయాలి - జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్

;50 వేల ఖాళీలు భర్తీ కాదు పే-రివిజన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక లక్షా తొంభై మూడు వేల ఖాళీలు భర్తీ చేయాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు.. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణా నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ అద్యక్షతన రాష్ట్రము లో ఉద్యోగాల భర్తీ పై సమావేశం జరిగింది.  ఈ  సమావేశానికి  జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య విచ్చేసి ప్రసంగించారు. అసెంబ్లీ లో నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు50 వేల ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు కాని  రివిజన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక లక్షా తొంభై మూడు వేల ఖాళీలుఉన్నట్లు పేర్కొన్న విశ్యయాన్ని ఈ సందర్బంగా కృష్ణయ్య గుర్తు చేసారు. ముఖ్యమంత్రి ఈనెల 27లోగా (రేపటిలోగా) ఏయే ప్రభుత్వ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నవో తెలుపాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి కీలక ఈ సందర్భంలో ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరిలు, కమిషనర్లు పూర్తి ఖాళీలు తెలపాలని డిమాండ్ చేసారు.రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా క్రింద భర్తీ చేయవలిసిన  గ్రూప్-1,2,3,,4 సర్వీస్ ఉద్యోగాలను సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించి – గణన చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపడం లేదు. ఎదో నామమాత్రంగా లేక్కిoచి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే అన్ని శాఖలలో అడ్ హక్ ప్రమోషన్ల పేరుమీద అక్రమంగా  భర్తీ చేశారని,అలాగే డైరెక్టు రిక్రూట్ మెంట్ కోటా క్రింద వచ్చే  పోస్టులను ప్రమోషన్ల క్రింద భర్తీ చేశారన్నారు.కొందరు ఉన్నతాదికారులు డైరెక్టు రిక్రూట్ మెంట్ లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రక్క రాష్ట్రమైన A.P లో రెండుసార్లు, కర్ణాటకలో ప్రతియేటా గ్రూప్-I – నోటిఫికేషన్ జారి చేస్తున్నారు. కాని మన రాష్ట్రంలో నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 6లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్-I నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో రాత్రింబవళ్ళు చదువుతు – కోచింగ్ కేంద్రాలకు కు వెళుతూ ప్రిపేర్ అవుతున్నారు. కావున వెంటనే నోటిఫికేషన్ జారి చేయాలనీ విజ్ఞప్తి చేసారు.ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, పసుపులేటి శశాంక్, చంటి ముదిరాజ్,లక్ష్మన్ యాదవ్, పగిళ్ళ సతీష్, ఉదయ్, చరణ్, మనోహర్, నిఖిల్, భరత్, R.కృష్ణ మూర్తి తదితరులు ప్రసంగించారు.    

Related Posts