YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ప్రాణం పోయినా స‌రే నీళ్ల విష‌యంలో రాజీప‌డే ప్రసక్తి లేదు - ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

ప్రాణం పోయినా స‌రే నీళ్ల విష‌యంలో రాజీప‌డే ప్రసక్తి లేదు - ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

ప్రాణం పోయినా స‌రే నీళ్ల విష‌యంలో రాజీప‌డే స‌మ‌స్య ఉత్ప‌న్నం కానేకాదు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై అన్ని ర‌కాలుగా ఫైట్ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లేవి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క అడిగిన ప్ర‌శ్న‌కు సీఎం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు.ఏపీ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన రాయ‌లసీమ ప్రాజెక్టుపై స్టేలు కూడా ఉన్నాయి. జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ కూడా స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వానికి తాము కూడా ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టు పూర్తి అసంబద్ధ‌మైన‌ద‌ని కేంద్రానికి చెప్పాం. అన్ని ర‌కాలుగా ఫైట్ చేస్తాం.. దాన్ని వ‌దిలిపెట్టే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాదు. రాజీప‌డే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కానేకాదు. ఈ ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది. అవ‌స‌ర‌మైతే శాస‌న‌స‌భ స‌భ్యులంద‌రూ ఢిల్లీలో కూర్చొనైనా.. పోరాడుతాం కానీ మ‌న నీటి హ‌క్కుల విష‌యంలో రాజీప‌డే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మే కాద‌ని స్ప‌ష్టం చేశారు.ఆర్డీఎస్ విష‌యంలో ఏపీ నాయ‌కులు మొండిగా ముందుకు పోతున్నారు. పాత ప‌ద్ధ‌తిలో వెళ్తామంటే ఇవాళ తెలంగాణ దిక్కులేని స్థితిలో లేదు. ఆర్డీఎస్‌లో క‌చ్చితంగా 15.9 టీఎంసీల నీటిని తీసుకుంటాం. ఒక్క బొట్టు నీటిని కూడా వ‌ద‌లం అని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణ స్వ‌యంప్ర‌తిప‌త్తి గ‌ల రాష్ర్టం.. ఆరాచ‌కం జ‌ర‌గ‌నివ్వం.. హ‌క్కుల‌ను కాపాడుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Related Posts