YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రాముడు పూజించిన దేవుడు

రాముడు పూజించిన దేవుడు

 

రాముడు పూజించిన దేవుడు ఆయనే, రావణుడితో పోరాడేటప్పుడు ఆదిత్య హృదయం పఠించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన బంధువులతో యుద్ధం చెయ్యాలా అని సతమతం అవుతూ ఉంటాడు. ఏవేవో ఆలోచిస్తాడు. అయితే ఆ సందర్భంలో కృష్ణుడు భగవద్గీతలోని సందేశాలను అర్జునుడికి వివరిస్తాడు. దీంతో అర్జునుడు సమరానికి సై అంటాడు. అయితే రామాయణంలో రావణుడితో యుద్ధం జరిగే సమయంలో అలిసిన రాముడిని ఇలాగే ఉత్తేజరపరిచే సంఘటన ఉంది. ఆదిత్య హృదయంసోత్రం ద్వారా రాముడు కోల్పొయిన శక్తిని మళ్లీ పొందుతాడు. రాముడు లంకలోకి అడుగుపెడతాడు. శ్రీరాముడిని ఎదుర్కోవడానికి చాలా మందిని పంపుతాడు రావణుడు. భయంకరమైన రావణుడి సేన యుద్ధంలో పాల్గొంటుంది.  వారందరినీ సంహరిస్తుంటాడు శ్రీరాముడు. యుద్ధం చేసి చేసి శ్రీరాముడు బాగా అలసిపోతాడు. ఇక ఎంతో మంది తన బాణాల దెబ్బకు విలవిలలాడిపోతుంటే రాముడు చూసి తట్టుకోలేకపోతాడు. ఇంత మారణహోమం నా వల్ల ఇంత మారణహోమం జరుగుతుందా అని బాధపడతాడు. అప్పుడు అగస్త్యుడు శ్రీరాముడిని అర్థం చేసుకుంటాడు. ఆయన దరికి చేరి నేను నీకు ఒక విషయం చెబుతాను దాన్ని పాటించు అంటాడు. చెప్పండి మునివర్యా అని రాముడు అంటారు. రామా మీరు ఇప్పుడు ఆదిత్యుడిని ప్రార్థించడం మంచిది అంటారు. నీ అనుమానాలన్నీ పటాపంచలై, నీకు కొత్త శక్తి వస్తుందని చెబుతాడు. వెంటనే శ్రీరాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందిస్తాడు. 
ముప్పై శ్లోకాలుంటాయి
ఆదిత్య హృదయంలో దాదాపు ముప్పై శ్లోకాలుంటాయి. ఇందులో ఇరవై రెండో శ్లోకం నుంచి ఇరవై ఏడో శ్లోకం వరకు ఆదిత్యహృదయం గురించి ఉంటుంది. దీన్ని పఠిస్తే ఏయే లాభాలు కలుగుతాయో అందులో ఉంటుంది. ఇక చివరను ఉండే ఇరవై తొమ్మిది, ముప్పై శ్లోకాలను పఠిస్తే కొత్త శక్తి వస్తుంది. రాములవారు అన్ని శ్లోకాలు పఠిస్తాడు. 
కొత్త శక్తి వస్తుంది
ఆదిత్య హృదయం మొత్తం చదివాక శ్రీరాముడికి కొత్త శక్తి వస్తుంది. అర్జునుడు ఏవిధంగా అయితే కురుక్షేత్రంలో తలపడ్డాడో అలా రాములవారు కూడా తలపడతారు. దేవుడికే అంత ధైర్యాన్ని ఇచ్చి యుద్ధంలో విజేతగా నిలిపేలా చేసినా ఆదిత్య హృదయం సామాన్యులకు ఎంతటి శక్తిని ఇస్తుందో అర్థం చేసుకోవొచ్చు. 
ఆదివారం రోజు ఉదయాన్నే 
కష్టసమయాల్లో ఉన్నప్పుడు మీరు కూడా ఆపదలు ఎదురైనప్పుడు, అనారోగ్యాల బారినపడ్డప్పుడు మీరు కూడా ఆదిత్య హృదయం చదవండి. మంచి శక్తి వస్తుంది. రోజూ మూడుసార్లు ఆదిత్య హృదయం పఠిస్తే చాలు. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆయనకు ఇష్టమైన ఆదివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శ్లోకాలు పఠిస్తే చాలా మంచిది. ఆదిత్యుడి స్తోత్రాలు రోజూ పఠిస్తే కచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అంతా మంచే జరుగుతుంది. 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts