YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నేటికీ కనపడే రామాయణ కాల ప్రాంతాలు

నేటికీ కనపడే రామాయణ కాల ప్రాంతాలు

భారతదేశం లో రాముని అడుగులు పడిన ప్రతీ ప్రాంతము  మహిమాన్విత పుణ్యక్షేత్రాలుగా, ఆలయాలుగా వెలిశాయి. అటువంటి రామపాద స్పర్శతో పునీతమైన కొన్ని పుణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాము..
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోని అనేక ప్రాంతాలను  హిందువులు పూజిస్తారు. శ్రీ రామ ,లక్ష్మణ, భరత, శతృఘ్నులు, దశరధుడు, వశిష్ఠుడు, వాల్మీకి, మొదలైనవారికి సంబంధించిన అనేక స్ధలాలు అయోధ్యలో వున్నాయి. శ్రీ రాముని సన్నిధి సరయూనదికి సమీపమున వున్నది. ' కోలాపురం శ్రీ ధర్భశయనం ' అని పిలువబడుతున్నది. ఇక్కడ సరయూనది మూడు మైళ్ళ వెడల్పుగా ప్రవహిస్తున్నది. రాముడు , దశరధుడు స్నానంచేసిన  స్థలం ' రాజ్ ఘాట్' అని పిలువబడుతోంది. సరయూనది ఒడ్డున రాముని స్నాన ఘట్టం అని ఒక ఘాట్ వున్నది. శ్రీ రాముడు తన అవతారసమాప్తి సమయమున ఇక్కడే నీటిలో మునిగి నిలబడగా,  ఆకాశం నుండి పుష్పకవిమానం వచ్చి తీసుకుని వెళ్ళినదని చెప్తారు. దీని తరువాత లక్ష్మణ్ ఘాట్, హనుమాన్ ఘాట్ వున్నవి . ఇక్కడ బిర్లా నిర్మించిన ఆలయంలో 50 కి. బంగారం తో శ్రీ రాముని, సీతాదేవి మొదలైనవారి విగ్రహాలు గర్భగుడిలో కనిపిస్తాయి.ఇక్కడ నిత్యం పూజలు, భజనలు జరుగుతూనే వుంటాయి. రాముడు నివసించిన రాజభవనం, పట్టాభిషేకం జరిగిన దర్బారు,  సీతాదేవి అంతఃపురం, రాజమాతల అంతఃపురాలు, రాముడు తన సోదరులతో ఆడుకున్న ప్రదేశాలు ఇంకా వున్నవి. దక్షిణ దేశపు భక్తులు నిర్మించిన రాముని ఆలయం వున్నది.
బదరీనాధ్ , కేదారనాధ్ వెళ్ళే మార్గంలో ఋషీకేష్ వున్నది ఇక్కడ లక్ష్మణునికి భరతునికి విడిగా ఆలయాలు వున్నవి. రామరావణ యుధ్ధం ముగిసిన పిదప శ్రీ రాముడు ఇక్కడి కి వచ్చి 40 కి.మీ దూరంలో వున్న  గంగలో స్నానం చేసి, దేవప్రయాగలో తపం చేసినట్లు చెప్తారు. ఇక్కడ శ్రీ రామునికి ప్రత్యేక ఆలయం వున్నది. ఋషీకేష్ లోని రామగుండం ,లక్ష్మణగుండాలలో స్నానం చేయడం పుణ్యప్రదం అని చెప్తారు. ఇక్కడ వున్న లక్ష్మణుని ఆలయంలో ఆయన ఆదిశేషువు అవతారమని చెప్పడానికి చిహ్నంగా లక్ష్మణుని విగ్రహం కిరీటంపై పది తలల నాగం కలిగి వుంటుంది. 
చిత్రకూటమనేది శ్రీ రాముని వనవాసకాలంలో మొదటి సంవత్సరం గడిపిన ప్రాంతం. సమీపమున వున్న మందాకిని నదీ తీరాన రాముడు ఆశ్రమం నిర్మించుకుని నివసించిన ప్రాంతం. ఇక్కడ సీతారాములకు ప్రత్యేక ఆలయం వున్నది. భరతుడు వచ్చి రామ పాదుకలను తీసుకు వెళ్ళిన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే లక్ష్మణుడు, గుహుడు రామునికి రక్షకులుగా వుండి కాపాడారు అని చెప్తారు. ఇది గయతో సమానమైన పుణ్యస్ధలంగా చెప్తారు. అనేకమంది హిందువులు ఇక్కడ పితృతర్పణాలు యివ్వడానికి వస్తూ వుంటారు. ఇక్కడ వున్న మహావిష్ణువు ఆలయంలోని విష్ణు పాదాలను పూజిస్తారు. ఇక్కడ నే వున్న ఫల్గుణీ నదిలో స్నానం చేసి రాముడు తన తండ్రి దశరధునికి పితృతర్పణాలు వదిలాడని  అంటారు. 
పునీత నదీ తీరాన వున్న నాసిక్..పంచవటి అనే పవిత్రస్ధలాలు వున్నవి. ఇక్కడే శూర్పణఖ ముక్కు చెవులు కోశారని, నాసిక అనేది నాసిక్ అయినది అని అంటారు.  రావణుడు సీతాదేవిని అపహరించిన స్ధలం యిదే అని అంటారు. ఈనాడు ఆ ప్రాంతం తపోవనం అని పిలువబడుతున్నది. 
గోదావరి నదీ తీరాన స్నాన ఘట్టాలు అనేకం వున్నవి. వాటిలో ముఖ్యమైనది " రామగుండం అన్నది. ఇక్కడ శ్రార్ధం పెట్టడం విశేషం. ఇక్కడ వున్న రామాలయం నల్లబండరాయితో నిర్మించినది. నల్లగా వున్నందున కాలారామ్ అని పిలువబడుతున్నాడు. ఈ ఆలయానికి సమీపమున ' సీతా గుహ' అని ఒకటి వున్నది. ఇక్కడే ఐదు  మఱ్ఱి వృక్షాలు  పెనవేసుకుని దగ్గిరగా వుంటాయి, అందువలన యీ ప్రాంతం పంచవటి అని పిలువబడుతున్నది . పంచవటిలోని రాముని ఆలయానికి ' ముక్తరమ్' అనే పేరు వున్నది. ఈ రామాలయం  50 అడుగుల వెడల్పు, 125 అడుగులు ఎత్తున, ఒక స్ధంభం కూడా లేకుండా విశాలంగా నిర్మించబడినది.
ముక్తిధామ్..
ఇక్కడి కి అనేకమంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. పంచవటికి ఇంకొక తీరాన నాసిక్ నగరం వున్నది.
తెలంగాణా ఖమ్మం జిల్లాలో నిర్మించబడిన రామాలయం ప్రసిద్ది చెందినది. అక్కడే  రాముడు గోదావరి నదిని దాటి సీతను వెతుకుతూ లంకకి వెళ్ళినట్టు చెప్తారు. భధ్రాచలమనే  పవిత్రస్ధలానికి సమీపమున రాముని పర్ణశాల వున్నది.  అది యీనాటికి పూజలు చేసే పవిత్రమైన స్ధలం. ఇక్కడ వున్న భధ్రాచలరాముని ఆలయం ప్రసిద్ది చెందినది. గోదావరి భారతదేశం లోని పెద్ద సప్తనదులలో ఒకటి. ఈ నది ఒడ్డు పొడవునా లెక్కలేనన్ని  రామాలయాలు  రామాయణానికి సంబంధించి వున్నవి.
కర్ణాటక రాష్ట్రం
మైసూర్ జిల్లా  దక్షిణ సరిహద్దు ప్రాంతంలో  విస్తరించి  వున్న  పర్వతాల వరస ' బిలిగిరి' , 'బిలిగిరి రంగణ్ణా' అని పిలువబడుతున్నది. ఇక్కడ వున్న మహావిష్ణువు ని శ్రీ నివాసునిగా ,శ్రీ వేంకటేశ్వరునిగా, శ్రీ రంగనాధుని గా, అమ్మవారిని లక్ష్మీ దేవిగా, అలమేల్మంగాదేవిగా, శ్రీ రంగనాయకి గాను పూజిస్తున్నారు. శ్రీ రాముడు సీతాదేవిని వెతుకుతూ వెళ్ళినప్పుడు శ్రీ రంగనాధుని, శ్రీ రంగనాయకిని పూజించి వెళ్ళినట్టు స్ధల చరిత్ర చెబుతున్నది. హంపీ నగరానికి సమీపమున ప్రవహించే తుంగభద్రే రామాయణంలో చెప్పే పంపా్సు  అనే నది అని అంటారు. ఇక్కడ వున్న కిష్కింద ప్రాంతానికి వచ్చిన రాముడు విరూపాక్షస్వామిని పూజించారు. దాని ఫలితంగానే, ఇక్కడే రామునికి సుగ్రీవుని, హనుమంతుని మైత్రి లభించింది. వారి సహాయంతో సీతాదేవి తిరిగి లభించినదని స్ధల పురాణ కధ. హంపీకి దక్షిణ తూర్పు దిశ చివరిలో వున్నది మాల్యవంత పర్వతము. ఆ పర్వతము మీద వున్నది రఘునాధస్వామి ఆలయం.  గర్భగుడిలో శ్రీ రాముడు సీతాదేవి ఆశీనులైవుండగా  కొంచెం ప్రక్కగా లక్ష్మణుడు ఒదిగి నిలబడినాడు. మరో చివర హనుమంతుని మూర్తిని దర్శిస్తాము. శ్రీ రాముడు లక్ష్మణుడు యీ పర్వతం మీద కొంచెము రోజులు నివాసము వునట్టు స్ధల పురాణం. హంపీ సమీపమున తుంగభద్ర నది  ఒడ్డున వున్నది ఆనెగొంది.  రామాయణంలో ఒక ముఖ్య ఘట్టానికి నిదర్శనంగా  వున్నది యీ ప్రాంతం. వాలి ,సుగ్రీవులు తమ వానరసేనతో నివసించిన కిష్కింద స్ధలంగా చెప్తారు. అక్కడే వున్న పర్వతం ఒకటి ఋష్యమూక పర్వతం.సమీపాన శబరి ఆశ్రమం వున్నది. పంపాసరస్సు వున్నది. 
ఆంజనేయుని అంజనగిరి
వున్నది. నదిని దాటితే దక్షిణ తీరాన హేమకూటపర్వతం, మతంగ మహర్షి తపస్సు చేసిన స్ధలం, సుగ్రీవుడు  దాగిన పర్వత గుహ,  రాముడు చాతుర్మాస్య  వ్రత కాలంలో నివసించిన మాల్యవంత పర్వతము మొదలైనవి వున్నవి. శ్రీ రామునికి, హనుమంతుని తోడు సుగ్రీవుని మైత్రి దొరికిన ధర్మ భూమి.
శ్రీ కృష్ణ పరమాత్మ  ద్వాపరయుగంలో , శ్రీ రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల విగ్రహాలను ఆరాధిస్తూ వచ్చాడు. పిదప ద్వారక మునిగిపోయినప్పుడు ఆ నాలుగు విగ్రహాలు నీటిలో కొట్టుకు పోయియి. చాలా రోజులకి పడమటి ఒడ్డున బెస్తవారికి ఆ విగ్రహాలు
దొరికాయి. వాటిని ఏం చేయాలో తోచక వాటిని తిరుపయ్యారు ప్రాంతానికి 5 మైళ్ళ దూరంలో దక్షిణం గా వున్న' కైప్పమంగళం' అనే ఊరిలో వున్న' వాయ్ క్కల్ కైమళ్' అనే సామంత రాజుకి అప్పగించారు. ఆ సామంతరాజు, జ్యోతిష్కులు , మొదలైనవారి ఆలోచన ప్రకారం, ఆ విగ్రహాలను వేరు వేరు చోట్ల ప్రతిష్టించాడు. ఆవిధంగానే తిరప్రైయార్ అనే చోట రామునికి ఇరింజాల్ కూడాలో భరతునికి, తిరుముళికుళంలో లక్ష్మణునికి, పాయమ్మలిలో శతృఘ్నునికి ఆలయాలు వున్నవి.అగస్త్య మహర్షి ప్రతిష్టించిన శివలింగం వున్న ప్రాచీన ఆలయం పంజేష్టి అనే పవిత్రమైన ప్రాంతంలో వున్నది. రావణుని సంహరించడానికి బయలుదేరిన రామలక్ష్మణులు, యీ స్ధలంలో అగస్త్య మహర్షిని దర్శించి , పరమేశ్వరుని, అంబికల అనుగ్రహం పొంది వెళ్ళాడని స్ధల చరిత్ర తెలుపుతున్నది. ఉడ్పూరు వినాయకుని ఆలయంలో, రాముడు సీతాదేవిని క్షేమంగా తీసుకురావడానికి పూజించాడని చెప్తారు. ఇక్కడే రాముడు సముద్ర రాజు గర్వాన్ని అణచడానికి దర్భగడ్డినే బాణంగా వేసిన తిరు పుల్లాణి అనే పేరు పొందిన స్ధలం యిది. ఇక్కడ ప్రసిద్ది చెందిన రాముని ఆలయం వున్నది. రామేశ్వరం దీవిలో రాముడు లంకను చూసి దూరం లెఖ్ఖకట్టిన  గంధమాదన పర్వతం వున్నది.ఇక్కడ రాముడు నిలబడిన చిహ్నంగా రాముని పాదముద్రలు వున్నవి. రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్ళే దోవలో కోదండరాముని ఆలయం వున్నది.రావణుని తమ్ముడు విభీషణుడు నలుగురుని తోడు తీసుకుని రాముని శరణు కోరిన స్ధలం యిదే. ఈ ధనుష్కోడి వద్దనే సేతు నిర్మాణానికి  రాముడు విల్లుతో గీత గీసి చూపించాడు. ధనుష్ అంటే విల్లు అని అర్ధం. 
రాముడు  తండ్రి మాట జవదాటరాదని దక్షిణ దిశా మార్గంలో తులసీ వనం అనే బృందారణ్యంలో విడిది చేశాడు. ఆ సమయంలో
అక్కడ దీర్ఘ తపస్సులో వున్నారు భృంగి మహర్షి. ఈనాడు పరంగిమలై అని పిలుస్తున్న ప్రాంతమే ఆనాడు భృంగిమహర్షి నివసించిన ప్రాంతం అనిఅంటారు.  భృంగి మహర్షి రాముని కొంతకాలమైనా తమ ఆశ్రమంలో నివసించమని  కోరగా రాముడు అంగీకరించాడు.  ఈవిధంగా భృంగి మహర్షి నివసించిన  భృంగిమలై అనేది తరువాత కాలంలో పరంగిమలైగా మారినది. దాని ప్రక్కన పూలవనంగా వున్న  ప్రాంతంలో రాముడు నివసించాడు. దానికి నందనవనం అనే పేరు వుండేది. అది ఈనాడు నందంబాక్కం అనే పేరు పొందినది. ఋషులు అందరూ రాముని దర్శించి, ఈక్కాటిల్ నివసించండి అని అన్నందువలన " ఈక్కాట్టుతాంగల్ " అనే పేరు  వచ్చింది. ప్రక్కనే రామాపురం, దేవికుప్పం, సీతాపురం  అనే ఊళ్ళు వున్నవి.
రామనాధపురం జిల్లా లోని దేవీ పట్టణంలో నవగ్రహాలను  రాముడు పూజించాడని  స్ధలపురాణం తెలుపుతున్నది. 
ఈ విధంగా భారతదేశంలో  ఆసేతు హిమాచలపర్యంతం అనేక స్థలాలు శ్రీరామపాద స్పర్శతో పునీతమైనాయి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts