YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బృందావనానికి గంధ లేపనం అక్షయ తృతీయ సందర్భంగా విశేష అలంకరణ

బృందావనానికి గంధ లేపనం అక్షయ తృతీయ సందర్భంగా విశేష అలంకరణ

మంత్రాలయం
పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అక్షయ తృతీయ సందర్భంగా గంధ లేపనంతో విశేషంగా అలంకరించారు. పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు మూల బృందావనానికి స్వయంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా  తుంగభద్ర నది జలంతో బృందావనానికి జలాభిషేకం గావించారు. పంచామృతాభిషేకం అనంతరం  గంధంతో బృందావనం ఆసాంతం లేపనం గావించారు. అనంతరం మంగళ హారతులు సమర్పించారు. పీఠాధిపతులు మూల రాముల పూజలను   పూజా మందిరంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా వేలాది మంది భక్తుల సమక్షంలో అక్షయ తృతీయ వేడుకలను నిర్వహించేవారు. గంధ లేపనం అలంకారంలో ఉన్న రాఘవేంద్రస్వామి బృందావనాన్ని భక్తులు దర్శించుకుని పావవనం చెందేవారు. ఈ సంవత్సరం కరోనా  మూలంగా లాక్ డౌన్  విధించడంతో గుడి తలుపులు మూసి వేశారు .భక్తుల దర్శనాలనురద్దు చేయడంతో బృందావనాన్ని భక్తులు  దర్శించుకో లేకపోయారు. కానీ అంతర్జాలంలో  స్వామి మూల బృందావనాన్ని భక్తులు దర్శించుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు.

Related Posts