YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ కోసమే నేను పుట్టా

తెలంగాణ కోసమే నేను పుట్టా

నల్గోండ, ఏప్రిల్ 26
తనను దేవుడు తెలంగాణ కోసమే పుట్టించారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్ అని.. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలు అని వ్యాఖ్యానించారు.  కేసీఆర్.. అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు. మార్గమధ్యలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేశారు.. మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. పిచ్చిగా ఉన్మాదంతో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి. బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది. ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు.. ఇదీ నడుస్తాంది. మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ మిలకత్ అయినయి. అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా? తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీకి. కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. ఇప్పుడు యువత భవిష్యత్తు మీదే ఆలోచించాలి.  మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం. తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం. మొదటి సంవత్సరంలోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం. రైతులకు రైతుబంధు ఇచ్చుకున్నాం. బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం. కాంగ్రెస్ పెద్దలు ఐదెకరాలకు రైతుబంధు ఇస్తామంటున్నారు. మరి ఆరో ఏకరం వాడు ఎటుపోవాలి? పొలాలను ఎండబెట్టిండ్రు. బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి. ధాన్యం కొంటలేరు. రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది. కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది. దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు. రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె. నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా? ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తాలేరు. చేనేత కార్మికులను ఆదుకుంటలేరు. నిరుద్యోగ భత్యం లేదు.. అంతా బోగస్. పంట ధాన్యానికి ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు. రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఇచ్చిండ్రా? కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం తుస్సుమన్నది బోనస్ అయింది.
నా గుండె చీలిస్తే కనపడేది ప్రజలే
గృహజ్యోతికి విద్యుత్తు.. పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది. స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది. నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు. ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్.. కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు. దేర్ హోగా మగర్ అందేర్ నహీ.. మనది సెక్యులర్ పార్టీ. నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం. బీఆర్ఎస్ కారు గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి. ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు. ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

Related Posts