హైదరాబాద్
వైకాపా ఎంపి రఘురామ కృష్ణంరాజు శుక్రవారం నాడు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయ్యారు. అయనను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 124 బీ సెక్షన్ కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలు వున్నాయి. ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేసారు. అయితే రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. అయన చుట్టూ చేతులు కట్టుకుని వలయంగా నిలబడి ఏపీ పోలీసులను ఆపివేసారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అరెస్ట్ చేయనిస్తామని సీఆర్పీఎఫ్ పోలీసులు స్పష్టం చేసారు. చివరకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు.