YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వకీల్ సాబ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

వకీల్ సాబ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

హైదరాబాద్, మే 18, 
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమా వచ్చిందంటే.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌.. దానిపై దృష్టి పెట్టాలని సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నారు. లేటెస్ట్‌గా ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించారు ఆయన. హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘పింక్’ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సినిమాలో పవన్‌ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్యలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మధ్యే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లోనూ విడుదలై.. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే సినిమా విడుదలై నెల రోజులు దాటినప్పటికీ.. చిత్ర యూనిట్ నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ వస్తూనే ఉంది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ప్రత్యేకంగా గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘మగువా.. మగువా’ అనే పాట సూపర్‌హిట్ అయింది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్ అందనుంది. ఈ సినిమా తాలూకా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్‌ను విడుదల చేయ్యనున్నట్టు థమన్ కన్ఫర్మ్ చేశారు. అయితే అది ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. థమన్ అం
 

Related Posts