YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మూలన పడిన వెంటిలేటర్లు

తెలంగాణలో మూలన పడిన వెంటిలేటర్లు

వరంగల్, మే 19, 
రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నా.. కండ్లముందే పేషెంట్లు శ్వాస అందక పిట్టల్లా రాలుతున్నా.. అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను వాడుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్‍ అవుతోంది.  పీఎం కేర్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 1,400 వెంటిలేటర్లు ఇస్తే వాటిలో సగానికిపైగా వెంటిలేటర్లు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఫిట్టింగ్కు నోచుకోక మూలనపడి ఉన్నాయి. వాటిని ఆపరేట్ చేసే అనస్థీషియా టెక్నీషియన్లు లేక అందుబాటులోకి రావడం లేదు. వారిని రిక్రూట్ చేయాల్సిన రాష్ట్ర సర్కారు స్పందించడం లేదు.  దేశవ్యాప్తంగా గతేడాది కరోనా వణికించిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్‍ స్కీంలో భాగంగా రాష్ట్రానికి 1,400 వెంటిలేటర్లు అందించింది.  ఒక్కో వెంటిలెటర్‍ ఖర్చు ఎంత తక్కువ అనుకున్నా రూ. 50 లక్షలు ఉంటుంది. అందులో వరంగల్‍ ఎంజీఎంకు 100, ఆదిలాబాద్‍ రిమ్స్ కు100, సూర్యాపేటకు 40, సిద్దిపేటకు15, మహబూబాబాద్కు 12, కరీంనగర్కు 10, నిజామాబాద్‍ కు 10, జోగులాంబ గద్వాలకు 9, రాజన్న సిరిసిల్ల కు 8, జనగామకు 8, జగిత్యాలకు 8, మంచిర్యాల –బెల్లంపల్లికి 7, ఆసిఫాబాద్‍ కు 5, కామారెడ్డికి 4, నాగర్‍కర్నూల్‍ జిల్లా ఆసుపత్రికి 3.. ఇట్ల రాష్ట్రానికి మొత్తం 1,400 వెంటిలేర్లను కేంద్రం పంపించింది. కానీ చాలా జిల్లాల్లో వెంటిలేటర్లను మూలకుపడేశారు. సంగారెడ్డి లోని పెద్దాసుపత్రికి 20 వెంటిలేటర్లు రాగా, ఆ కార్టన్లను ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. వీటిని వినియోగంలోకి తేవాలంటే అదనంగా పది మంది సీనియర్ నర్సులు, నలుగురు పల్మనాలజిస్టులు, ఏడుగురు అనస్థీషియా టెక్నీషియన్స్ అవసరమని జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ కె. సంగారెడ్డి గత నెల ఏప్రిల్ లో జిల్లా కలెక్టర్ కు  ప్రపోజల్స్ పంపారు. కానీ ఇప్పటికీ రెస్పాన్స్ రాలేదని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి పీఎం కేర్స్ కింద 40 వెంటిలేటర్లు రాగా, సరిపడా టెక్నీషియన్స్ లేక 20 వెంటిలేటర్లను వాడడం లేదు. ఈ హాస్పిటల్లో మే 7న11మంది, 8న ఆరుగురు, 9న నలుగురు, 10 న ఐదుగురు కరోనా తో చనిపోవడం వెనుక సరిపడా వెంటిలేటర్లు లేకపోవడమే కారణమనే ఆరోపణలు వచ్చాయి.  నల్గొండలోని టీచింగ్ హాస్పిటల్నే తీసుకుంటే ఇక్కడ పీఎం కేర్స్ కింద 38 వెంటిలేటర్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఫిటింగ్ చేయలేదు. సివియర్ పేషెంట్లు పెరుగుతుండటంతో 10 వెంటిలేటర్లనైనా వినియోగంలోకి తీసుకురావాలని ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. వెంటిలేటర్లు వాడుకునే ఫెసిలిటీ ఉన్నా వాటిని ఫిట్టింగ్ చేసే ప్లగ్గులు మార్కెట్‌లో దొరకలేదు. వాటి కోసం టెక్నిషియన్లు ఇప్పటికే పలుసార్లు హైదరాబాద్, చెన్నై వెళ్లివచ్చారు. కానీ దొరకలేదని తెలిసిందివరంగల్‍ ఎంజీఎం హస్పిటల్‍కు పీఎం కేర్స్‌ నుంచి ఏడాది కింద సెంట్రల్‍ గవర్నమెంట్‍ 100 వెంటిలేటర్లు కేటాయించింది. అందులో 36 వెంటిలేటర్లనే వాడుతున్నారు.  హాస్పిటల్లో సకాలంలో ఆక్సిజన్‍ అందక, వెంటిలేటర్‍ దొరక్క చాలా మంది మరణించారు. ఇప్పటికీ రోజుకు 20 ప్రాణాల దాకా పోతున్నాయి. గత 20 రోజుల్లో మంత్రులు పలుమార్లు రివ్యూలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 800 బెడ్లు, 650 ఆక్సిజన్‍ బెడ్లు.. 100 వెంటిలెటర్లు రెడీ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అధికారుల లెక్కల ప్రకారం 36  వెంటిలేటర్లే పని చేస్తున్నాయి. 74 వెంటిలెటర్లు మూలకుపడేశారు. ఒక్కో వెంటిలేటర్‍ కోసం రోజూ  వందలమంది కాళ్లవేళ్లా పడుతుంటే..  ఉన్నవాటిని వినియోగంలోకి తేకుండా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 110 వెంటిలెటర్లకు కనీసం 50 మంది టెక్నిషియన్లు అవసరం ఉండగా.. కేవలం 3 మాత్రమే సర్వీస్‍ ఇస్తున్నారు.  

Related Posts