YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మళ్లీ తెరపైకి కోమటిరెడ్డి పేరు

మళ్లీ తెరపైకి కోమటిరెడ్డి పేరు

నల్గొండ, జూన్ 1, 
రానున్న కాలంలో కాంగ్రెస్ కు కష్టాలు తప్పేట్లు లేవు. ఉన్న నేతలు కూడా పార్టీని విడిచి వెళ్లే అవకాశముంది. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. ఆయన అతి కొద్దిరోజుల్లోనే పార్టీకి గుడ్ బై చేప్పే అవకాశాలున్నాయి. వరస ఓటములు, కాంగ్రెస్ ఇక కోలుకోలేదని భావించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇది గత కొంతకాలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు సమయం వచ్చిందంటున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ రెండోసారి ఓటమి పాలయిన తర్వాత పూర్తి స్థాయి అసంతృప్తిలో ఉన్నారు. పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం, ఇన్ ఛార్జులుగా వచ్చిన వారు కొందరి చేతుల్లో పావులుగా మారడం లాంటివి ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. అనేక సార్లు బహిరంగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరస్ట్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఇక ఫ్యూచర్ లేదు. అయితే బీజేపీలోకి వెళితే తమకు దక్కే ప్రాధాన్యంపైనే ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది లేదు. వ్యాపార కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఇక టీఆర్ఎస్ లో చేరినా తమ కుటుంబానికి నల్లగొండ జల్లాలో ప్రాధాన్యత ఉండదు. అయితే టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీయే నని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఇంతకు ముందే ఆయన బీజేపీలో చేరాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆగిపోయారంటున్నారు.ఇక పీసీసీ చీఫ్ పదవి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కితే ఈయన పునరాలోచించే అవకాశం ఉంది. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకుంటే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెండా పీకేయడం ఖాయమంటున్నారు. ఈ మేరకు ఆయన స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో లేనట్లే పార్టీ కూడా వ్యవహరిస్తుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది

Related Posts