YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలు వైసీపీలో గ్రూపుల టెన్షన్

ఒంగోలు వైసీపీలో గ్రూపుల టెన్షన్

ప్రకాశం, జూలై 20, 
ఇద్దరూ మంత్రి అనుచరులే. హోదాకు తగ్గ పదవుల్లోనే ఉన్నారు. కానీ.. ఆధిపత్యపోరు వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం వచ్చేసింది. ఎవరికి నచ్చజెప్పాలో.. ఇంకెవరిని బుజ్జగించాలో తెలియక తలపట్టుకుంటున్నారట ఆ అమాత్యుడు. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ గంగాడ సుజాత. ఈయన డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ. ఇద్దరూ అధికారపార్టీలోనే ఉన్నారు. పైగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుంగ అనుచరులు. ఆయన ఆశీసులతోనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు అధిరోహించారు. కొత్త పదవులు చేపట్టి నాలుగు నెలలు అయ్యిందో లేదో అప్పుడే పొరపచ్చాలు వచ్చేశాయి. ఒంగోలు అభివృద్ధిలో కలిసి సాగాల్సిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు ఎడముఖం.. పెడముఖంగా మారిపోయారు. వీరి మధ్య మొదలైన విభేదాలే ఒంగోలు వైసీపీని వేడెక్కిస్తున్నాయి.మేయర్‌ సుజాతపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు డిప్యూటీ మేయర్‌ సూర్యనారాయణ. దీంతో రెండు వర్గాలను పిలిచి మంత్రి బాలినేని పంచాయితీ చేశారట. కానీ ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో సమస్య ఆయనకు తలనొప్పిగా మారినట్టు చెబుతున్నారు. మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారిన 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా మొన్ననే ఎన్నికలు జరిగాయి. ఛైర్‌పర్సన్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో సుజాతకు ఛాన్స్‌ ఇచ్చారు మంత్రి. డిప్యూటీ మేయర్‌ సూర్యనారాయణ కూడా బాలినేనికి గట్టి ఫాలోవరే. మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో కలిసికట్టుగా ఒంగోలు అభివృద్ధికి కృషి చేస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. వారి మాటలు.. చేతలు చూసి.. ఒంగోలుకు మహర్దశ పట్టుకుందని భావించారు పార్టీ కేడర్‌. కానీ.. నాలుగునెలలకే రాజకీయం మారిపోయింది.మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు అస్సలు పడటం లేదు. పోస్టింగ్‌లు, పనుల్లో మేయర్‌ ప్రత్యేకంగా పర్సనల్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారన్నది సూర్యనారాయణ ఆరోపణ. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు రావడంతో మేయర్‌ భగ్గుమంటున్నారట. నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారట సుజాత. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్‌ కూడా మంత్రి దగ్గరకు వెళ్లి పోటాపోటీగా ఫిర్యాదు చేశారట. అప్పటి నుంచి మొదలు ప్రతి అంశంలో ఇద్దరి నుంచీ మంత్రికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయట.ప్రకాశం జిల్లా వైసీపీలో గ్రూప్‌ పాలిటిక్స్‌తో సతమతం అవుతున్న మంత్రి బాలినేనికి.. ఒంగోలు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పంచాయితీ తలనొప్పిగా మారిందట. కేడర్‌ కూడా రెండు వర్గాలుగా విడిపోయి వైరిపక్షాలుగా తగువులు పెట్టుకుంటున్నారట. మరి.. అనుచరుల మధ్య రేగిన ఈ సమస్య రచ్చ రంబోలా కాకుండా బాలినేని ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Related Posts