YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెగులు నివారణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పత్తికొండలో ఎస్ఆర్ పొలంబడి నిర్వహిస్తున్న అధికారులు

తెగులు నివారణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పత్తికొండలో ఎస్ఆర్ పొలంబడి నిర్వహిస్తున్న అధికారులు

తెగులు నివారణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
పత్తికొండలో ఎస్ఆర్ పొలంబడి నిర్వహిస్తున్న అధికారులు
పత్తికొండ
సాగుచేసిన పంటలకు తెగులు సోకిన వెంటనే రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించి నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ సబ్ డివిజన్ షేక్ మహమ్మద్ ఖాద్రి అన్నారు. గురువారం పత్తికొండ పట్టణానికి చెందిన రైతు పొలంలో వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 మంది రైతులకు చెందిన 10 హెక్టార్లలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు ఎలా తీయాలి రైతులకు తెలియపరచడానికి ఒక రైతుకు చెందిన 2.50 ఎకరాల్లో వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలతో పంట సాగు చేసే విధానాన్ని రైతులకు చూపిస్తామన్నారు. రైతు సాగు చేసిన విధానానికి అధికారులు చేసిన పద్ధతులకు వచ్చిన దిగుబడులలో తేడాలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు. వేరుశనగ మొక్కల ఆకులను పురుగులు తిన్నప్పటికీ తగిన దిగుబడులు వస్తాయని చెప్పారు. పురుగులు ఆకులను తినడం వల్ల దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెగులు నివారణకు విచ్చలవిడిగా మందులు పిచికారి చేయరాదన్నారు. ప్రతి పంటకు తగిన మోతాదులో మందులు వాడాలని చెప్పారు. అధికారుల సూచనలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మందులు వాడితే దిగుబడులు తగ్గడమే కాకుండా పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని సరిత, ఆర్బికె మండల సూపర్వైజర్ రియల్ భాష, విఏఏ లు శ్రీనాథ్, మల్లేష్ పాల్గొన్నారు.

Related Posts