YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల అంత వరకేనా

ఈటల అంత వరకేనా

హైదరాబాద్, ఆగస్టు 14, 
ఈటల రాజేందర్ పై ప్రస్తుతం విన్పిస్తున్న కామెంట్ ఇదే. ఎక్కువ కాలం ఈటల రాజేందర్ బీజేపీలో ఉండలేరంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇందుకు తగిన కారణాలను కూడా చూపుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినా ఆయన ఈ రెండేళ్ల పాటు బీజేపీ లో ఉంటారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీ సిద్ధాంతాల పట్ల ఈటల రాజేందర్ కు అంతగా విశ్వాసం లేకపోవడంతో పాటు మరికొన్ని కారణాలను చూపుతున్నారు.ఈటల రాజేందర్ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. కమ్యునిజం భావాజాలంతో పెరిగిన నేత. తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు 19 ఏళ్లపాటు తన రాజకీయ ప్రయాణాన్ని ఈటల రాజేందర్ కొనసాగించారు. టీఆర్ఎస్ ఫ్లెక్సిబుల్ గా ఉండే పార్టీ. అధినాయకుడికి విధేయత కనపరిస్తే చాలు ఎన్ని తప్పులు చేసినా అడిగేవారు లేరు. పట్టించుకునే వారే ఉండరు. అలాంటి టీఆర్ఎస్ లోనే ఈటల రాజేందర్ ఉండలేకపోయారు.ఇక బీజేపీ తనకు తాను గిరి గీసుకుని ఉండే పార్టీ. దానికి కొన్ని సిద్ధాంతాలున్నాయి. సూత్రాలున్నాయి. వాటిని కాదని ఏ ఒక్క వ్యక్తి కోసమో మార్చుకునే అవకాశం లేదు. పార్టీలో పదవి ఉంటేనే వేదికపై స్థానం కల్పించే పార్టీ అది. అలాంటి పార్టీలో ఈటల రాజేందర్ ఎక్కువ కాలం ఉండలేరని భావిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అవసరం తనకు, తనతో బీజేపీకి అవసరం ఉందని ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరారు.ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశముందంటున్నారు. ఈ రెండేళ్లు గడిచిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటకు వచ్చే అవకాశముందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనపడుతున్నాయి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండే కాంగ్రెస్ బెటర్ అని ఈటల వర్గీయులు కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సో.. ఈటల రాజేందర్ బీజేపీతో జర్నీ కొద్ది కాలమేనన్న విశ్లేషణలు గట్టిగా విన్పిస్తున్నాయి.

Related Posts