YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హూజురాబాద్ లో బీఎస్పీ పోటీ

హూజురాబాద్ లో బీఎస్పీ పోటీ

కరీంనగర్, ఆగస్టు 14, 
తెలంగాణ ఇప్పుడు హుజురాబాద్‌ వైపు చూస్తోంది. టీఆర్ఎస్‌, బీజేపీల నుంచి బరిలో దిగేది ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఉపఎన్నికలో దళితబంధుదే కీరోల్‌ అన్నది అధికారపక్షం ఆలోచన. అలాంటి చోట BSP పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? దళితుల మొగ్గు ఎటు? బీఎస్పీ బరిలో ఉంటే ఎర్త్‌ ఎవరికి? ప్రస్తుతం దీనిపైనే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకుండానే హుజురాబాద్‌ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నాయి. హుజురాబాద్‌ బైఎలక్షన్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నది విపక్షాల ఆరోపణ. ప్రధానంగా దళితబంధు పథకాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ పథకం అమలుకు జీవో కూడా వచ్చేసింది. లబ్ధిదారుల ఎంపికే మిగిలింది. నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ పథకం కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు. అయితే దళిత ఓటర్లపైనే ఎక్కువగా గురిపెట్టే BSP హుజురాబాద్‌లో పోటీ చేస్తే పరిస్థితి ఏంటన్న చర్చ ఊపందుకుంది.మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరాక.. ఆ పార్టీ గురించి తెలంగాణలో చర్చ మొదలైంది. హుజురాబాద్‌లో బీఎస్పీ పోటీ చేస్తుందో లేదో తెలియదు. ఒకవేళ పోటీ చేయడానికి నిర్ణయిస్తే.. ఏ పార్టీ ఓట్లకు గండిపడుతుందన్నది ప్రశ్నగా మారింది. దళితబంధు పథకం వల్ల లబ్ధి పొందినవాళ్లు కారు వైపు మొగ్గు చూపుతారా? లేక.. బీఎస్సీ వైపు టర్న్‌ అవుతారా అన్నది అంచనా వేయలేకపోతున్నారట. ప్రస్తుతం బీఎస్పీపై ప్రవీణ్‌కుమార్‌ స్వేరోస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది.సిద్ధాంతల దృష్ట్యా బీఎస్పీ ఉపఎన్నికలో పోటీ చేస్తుందా అన్నది డౌట్‌. ఉపఎన్నికల్లో BSP పోటీ చేయదన్నది కొందరి వాదన. బీఫామ్‌ ఇచ్చి అభ్యర్థిని పోటీలో నిలిపే సంప్రదాయం లేదని చెబుతున్నారు. హుజురాబాద్‌లో ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా.. లేదా వైఖరి మార్చుకుంటుందా అన్నది తెలియదు. ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ రాకపోవడంతో.. అప్పటికి ఆ పార్టీ వైఖరి ఏంటన్నది అంచనా వేయలేని పరిస్థితి.తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో 2023 ఎన్నికలకు హుజురాబాద్‌ను ఒక లాంచింగ్‌ ప్యాడ్‌గా ఉపయోగించుకోవాలని పార్టీలు చూస్తున్నాయి. ఒకరిపై ఒకరు పగ సాధించుకోవాలని కూడా కొన్ని సంఘాలు కాచుకుని ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నవాళ్లను ఎవరైనా చేరదీస్తారా? లేక బరిలో ఉన్న పార్టీలో వారిని బుట్టలో వేసుకుంటాయా అన్నది చర్చగా ఉంది. హుజురాబాద్‌లో పోటీ చేయకపోయినా.. ఫలానా పార్టీకి మద్దతిస్తామని లేదా.. బరిలో ఉన్న అభ్యర్థికి సపోర్ట్‌ చేస్తామని బీఎస్పీ ప్రకటిస్తే ఏంటన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అందుకే అందరి చూపు ప్రస్తుతం BSPపై నెలకొంది.

Related Posts