YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు ఆంధ్ర ప్రదేశ్

క్రీడల అభివృద్ధితో రాష్ట్ర కీర్తిని ప్రపంచస్థాయికి తీసుకువెళతాం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

క్రీడల అభివృద్ధితో రాష్ట్ర కీర్తిని ప్రపంచస్థాయికి తీసుకువెళతాం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

క్రీడల అభివృద్ధితో రాష్ట్ర కీర్తిని ప్రపంచస్థాయికి తీసుకువెళతాం
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
కడప, ఆగస్టు 14
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అత్యంత ప్రధాన్యతతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి.. రాష్ట్ర కీర్తిని ప్రపంచ స్థాయిలో చాటి చెబుతామని... రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.. మొట్టమొదటిసారిగా శనివారం కడప నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అవరణలోని ఇండోర్, ఔట్ డోర్ స్టేడియంలను, అన్నిరకాల క్రీడలకు సంబంధించి మౌలిక వసతులను  పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్ ల నియామకానికి అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. క్రీడారంగంలో నూతన పాలసీని తీసుకువచ్చి.. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలనేది.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. ఆ దిశగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని స్పోర్ట్స్ అతరిటీల్లో మౌలిక వసతులు, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందివ్వడం జరుగుతోందన్నారు. క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే.. క్రీడల గురించి బాగా తెలిసిన వారే ఖచ్చితమైన న్యాయం చేయగలరన్నారు. క్రీడలపై ప్రత్యేక అభిమానం వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను మరింత పటిష్టం చేస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రభావం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు.. క్రీడా రంగంపై అధికంగా పడిందన్నారు. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో కూడా.. క్రీడారంగం ఆదరణకు నోచుకోలేక పోయిందన్నారు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసి, అన్నివర్గాల ప్రజలకు సమ న్యాయం చేస్తున్నారన్నారు.
కోవిడ్ కారణంగా.. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారిందని, ఆ ప్రభావం క్రీడా రంగంపై అధికంగా పడిందన్నారు. ఈ అవాంతరాలను అధిగమిస్తూ.. ముందుగా పేద ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కూడా మెరుగు పరిచేందుకు మరింత కృషిచేస్తున్నారన్నారు. క్రీడలు మానసిక వికాసంతో పాటు.. క్రీడాకారుల, కెరీర్, భవిష్యత్తుకు బాటలు వేసి రాష్ట్ర కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయన్నారు.  క్రీడారంగాన్ని ప్రోత్సహించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆశయంతో ముఖ్యమంత్రి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అందులో భాగంగానే పులివెందులలో అన్నిరకాల క్రీడల నిర్వహణకు గాను ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి, ఆయా క్రీడల్లో శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు.  గ్రామీణ స్థాయిలో.. క్రీడలను అభివృద్ధి చేసి.. గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్రీడా రంగంలో నూతన పాలసీని తీసుకువస్తోందని.. అందుకు అనుగుణంగా క్రీడాకారులకు, కోచ్ లకు, జిల్లా క్రీడా ప్రాంగణాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
అనంతరం.. నగర శివార్లలోని క్రీడా పాఠశాలను..  రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పరిశీలించారు. అక్కడ మౌలిక వసతులు, వివిధ క్రీడల శిక్షణ విభాగాలను ఆయన పరిశీలించారు. స్పోర్ట్స్ స్కూలు అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా మరింత కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ డా.రామచంద్రా రెడ్డి, డీఎస్ఏ చీఫ్ కోచ్ బాషా మోహిద్దీన్, ఆయా క్రీడల ఆకాడమీలకు చెందిన క్రీడాకారులు, సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts