YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

;ప్రపంచ దేశాలకు భారత్ వ్యాక్సిన్

;ప్రపంచ దేశాలకు భారత్ వ్యాక్సిన్

;ప్రపంచ దేశాలకు భారత్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22,
 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలకు టీకాలు అందించేందుకు గానూ భారత ప్రభుత్వానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘వచ్చే అక్టోబర్ నుంచి కరోనా వ్యాక్సిన్‌ల షిప్‌మెంట్‌ను తిరిగి ప్రారంభిస్తున్నందుకు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ధన్యవాదాలు. ఈ ఏడాది ఆఖరుకు అన్ని దేశాలు 40 శాతం వ్యాక్సినేషన్‌ను సాధించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ సాయం చాలా కీలకం కాబోతోంది’ అని గెబ్రియేసస్ ట్వీట్ చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆద్వర్యంలో పేద‌, మ‌ధ్య ఆదాయ దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కోవాక్స్. ఈ కోవాక్స్ లో ఇండియా ఎంతో కీల‌కం. ఇండియాలో త‌యారైన క‌రోనా వ్యాక్సిన్లను డ‌బ్ల్యూహెచ్వోకు కొంత మేర ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరం తెలిపింది. కానీ, ఇండియాలో క‌రోనా సెకండ్ ప్రభావంతో కేంద్రం వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌పై నిషేధం విధించింది. ఒక్క డోసు కూడా ఎగుమ‌తి చేయ‌లేదు. అయితే, ఇండియాలో వ్యాక్సినేష‌న్ స్పీడ‌ప్ కావ‌టంతో పాటు కంపెనీల వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచేశాయి. అక్టోబ‌ర్ నెల‌లో ఒక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్లే 22కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు కోవాగ్జిన్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. దీంతో కోవాక్స్ ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని అక్టోబ‌ర్ నుండి తిరిగి మొద‌లుపెడ‌తామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ప్రక‌టించారు. ‘వ్యాక్సిన్మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు.దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్.. భారత సర్కార్‌కు ధ‌న్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ వ్యాక్సిన్లు అంద‌ని దేశాలు ఎన్నో ఉన్నాయ‌ని, ఇలాంటి వారికి భార‌త నిర్ణయం ఎంతో ఊర‌ట‌నిస్తుంద‌న్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. ఇదిలావుంటే, మంగళవారం వరకు దేశంలో 82కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related Posts