YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

Power crisis in Punjab: తీవ్ర విద్యుత్ కోతలతో పంజాబ్ విలవిల, రైతుల ఆందోళన !!

Power crisis in Punjab: తీవ్ర విద్యుత్ కోతలతో పంజాబ్ విలవిల, రైతుల ఆందోళన !!

దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం కూడా బొగ్గు సంక్షభంతో తీవ్రంగా దెబ్బతింది. మొత్తం ఉత్తర భారతదేశంలోనే రాష్ట్రం అత్యధికంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 11 న రాష్ట్రంలో దాదాపు 2,300 మెగావాట్ల కొరత ఏర్పడింది. విద్యుత్ కొరత కారణంగా పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. బొగ్గు కొరత కారణంగా పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది.

 

పంజాబ్ లో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం .. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సీఎం

పంజాబ్ లో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం .. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సీఎం

ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో మూడు థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ క్రమంలో తమ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు సరఫరాను పెంచాలని కేంద్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ విజ్ఞప్తి చేశారు. పంజాబ్ రాష్ట్రంలో 5620 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నప్పటికీ అందులో సగం కూడా విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంపై ఆయన కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. బొగ్గు కొరత కారణంగా మిగతా థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా మూతపడే ప్రమాదం ఉందని ఆ విధంగా జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుండి, ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్న పంజాబ్
 

ఇతర రాష్ట్రాల నుండి, ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్న పంజాబ్

విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రైవేటు సంస్థలు, పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది రాష్ట్రానికి తలకు మించిన భారంగా మారింది. సోమవారం మాదిరిగానే, మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా 4 నుండి 7 గంటల వరకు విద్యుత్ కోతలను విధించారు. ఉత్తర ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (NRLDC) విడుదల చేసిన ఉత్తర ప్రాంతం యొక్క సోమవారం రోజువారీ కార్యాచరణ నివేదిక ప్రకారం, పంజాబ్ వినియోగదారులకు 11,046 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా 8,751 మెగావాట్లు సరఫరా చేయబడిందని, ఇక 2,295 మెగావాట్ల కొరతను విద్యుత్ కోతలుగా మార్చారని వెల్లడించింది.

ఇతర రాష్ట్రాలలో విద్యుత్ కొరత ఇలా..

ఇతర రాష్ట్రాలలో విద్యుత్ కొరత ఇలా..

ఇక పంజాబ్ కు పొరుగున ఉన్న హర్యానా, అదే సమయంలో, అత్యధికంగా 8,382 మెగావాట్ల డిమాండ్ ఉండగా 8,319 మెగావాట్ల సరఫరాను కలిగి ఉంది. ఇది 63 మెగావాట్ల కొరతకు దారితీసింది.రాజస్థాన్ గరిష్ట డిమాండ్ 12,534 మెగావాట్లు కాగా, 12,262 మెగావాట్ల విద్యుత్ సరఫరా కలిగి 272 మెగావాట్ల కొరతతో ఉంది. ఎన్‌ఆర్‌ఎల్‌డిసి ప్రకారం, ఢిల్లీకి అక్టోబర్ 11 న ఎలాంటి కొరత లేదు, ఎందుకంటే దాని డిమాండ్ 4,683 మెగావాట్లు.

అయితే ఉత్తర ప్రదేశ్ డిమాండ్ పగటిపూట 19,843 మెగావాట్లు కాగా రాష్ట్రంలో 18,973 మెగావాట్ల సరఫరా ఉంది. 870 మెగావాట్ల కొరత ఉత్తర ప్రదేశ్ లో ఉంది. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో 2,052 మెగావాట్ల రోజువారీ గరిష్ట డిమాండ్ ఉంది, అయితే అది 1,862 మెగావాట్ల విద్యుత్ ను కలిగి ఉంది. 190 మెగావాట్ల విద్యుత్ కొరతను కలిగి ఉంది. హిమాచల్‌ ప్రదేశ్లో 1551మెగావాట్ల డిమాండ్ ఉన్నందున ఎలాంటి లోటు లేదు, జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 200 మెగావాట్ల కొరత ఉంది.

బొగ్గు గనులకు దూరంగా పంజాబ్ .. బొగ్గు నిల్వలు లేని పరిస్థితి

 

బొగ్గు గనులకు దూరంగా పంజాబ్ .. బొగ్గు నిల్వలు లేని పరిస్థితి

పంజాబ్ ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రైవేట్ థర్మల్స్‌లో ప్రస్తుతం రోజువారీ బొగ్గు అందుతుందని, అయినప్పటికీ పరిస్థితి క్లిష్టంగానే ఉందని పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎస్‌పిసిఎల్) సిఎండి, వేణుప్రసాద్ పేర్కొన్నారు. పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (PSEB) ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అజయ్‌పాల్ సింగ్ అత్వాల్ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని థర్మల్స్ విద్యుత్ కేంద్రాలను నడిపే క్రమంలో 30-40 రోజుల వరకు బొగ్గు నిల్వలు ఎల్లప్పుడూ ఉంచబడతాయి. పంజాబ్ బొగ్గు గనులకు దూరంగా ఉంది, అందుకే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, మేము ఎల్లప్పుడూ ఒక నెల రోజుల స్టాక్ ను ఉంచుకునే వాళ్ళమని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.

పంజాబ్ కరెంట్ కోతలపై రైతుల ఆందోళన

పంజాబ్ కరెంట్ కోతలపై రైతుల ఆందోళన

ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ కొరత వల్ల విధిస్తున్న కరెంటు కోతలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా సరిగా లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. పంజాబ్లోని వివిధ జిల్లాలలో విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ లకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. విద్యుత్ సంక్షోభం నుండి పంజాబ్ రాష్ట్రం ఎప్పటికి గట్టెక్కుతుందో అన్న ఆందోళన పంజాబ్ వాసులలో వ్యక్తమవుతుంది. పంజాబ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పుడు కరెంట్ కోతలు పంజాబ్ అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి.

Related Posts