YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

కోట్ల వ్యాక్సినేషన్లు

కోట్ల వ్యాక్సినేషన్లు

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతోంది భారత్. రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది. కరోనాను కంట్రోల్‌ చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందుకే టీకాలు వేయడంపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. వ్యాక్సినేషన్‌లో రోజుకో రికార్డు క్రియేట్‌ చేస్తూ దూసుకెళ్తోంది. ఎంతలా అంటే, అభివృద్ధి చెందిన 7 దేశాలు అన్నీ కలిపి ఒక నెలలలో ఎన్ని టీకాలు ఇచ్చాయో, వాటికన్నా ఎక్కువ డోసులు మన దేశంలో వేశారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌.. డోసుల సంఖ్య ఇవాళ్టికి (అక్టోబరు 21.. గురువారం నాటికి) 100 కోట్లు దాటింది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా  కేంద్రం ప్రకటిస్తోంది. అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ విజయాన్ని లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రకటించింది. అలాగే మరికాసేపట్లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్‌‌ కైలాశ్‌ ఖేర్‌ ఆలపించిన పాటను, ఒక ఆడియో..విజువల్‌ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్ చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా నిలిచింది భారత్‌. 275 రోజుల్లోనే వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడంతో..వ్యాక్సిన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్రం. ఢిల్లీ RML ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ.కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్‌ను ఓ ఉద్యమంలా చేపట్టింది కేంద్రం. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమవగా..ఆగస్ట్‌ 6నాటికి 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసింది. ఇప్పటివరకు 31 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ కంప్లీట్‌ అయింది. దేశంలో ఇప్పటివరకు బిలియన్‌ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించింది
డబ్ల్యూహెచ్ఓ అభినందన
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 100 కోట్ల డోసులను పంపిణీ చేసి మరో ఘనతను సాధించింది. గురువారం నాటికి భారత్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ సాధించిన ఈ ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. 100కోట్ల డోసులను పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడంతోపాటు వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు అభినందనలు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. 100కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు టెడ్రోస్‌ స్పందిస్తూ రీట్విట్ చేశారు. '100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసి మరో మైలురాయిని సాధించినందకు భారత్‌కు అభినందనలు అంటూ పేర్కొన్నారు.ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ కూడా మాట్లాడారు. బలమైన నాయకత్వం, వివిధ రంగాల మధ్య సమన్వయం, ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ, ప్రజల కృషితో తక్కువ సమయంలో ఈ ఘనత సాధించడం గొప్ప పరిణామమని పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. దీంతోపాటు 100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను విజయవంతంగా పంపిణీ చేయడం పట్ల సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ఈ ఘనత సాధించిందంటూ పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ చారిత్రక కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వంతో పాటు అందరి సహకారంతో భారత్‌ ఈ విజయం సాధించిందంటూ భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

Related Posts