YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటీఎస్ ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్

ఓటీఎస్ ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్

కౌతాళం
ప్రజలతో ఓటియస్ పేరు తో ఇంటి స్థలాలు పై డబ్బులు వసూలు చేయడం చాలా దారుణంగా వుందని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి  వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ పార్టి కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్ ప్రభుత్వం ప్రజలు ను మోసము చేస్తుంది అని ఎపుడో కట్టిన ఇండ్లు కి ఓటియస్ పేరు తో డబ్బులు వసూలు చేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనం అని ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వసూలు చేయలేదు అని వారు పేర్కొన్నారు. ప్రజలు ఎవరు కూడా డబ్బులు కట్టవద్దు అని రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అని వారు అన్నారు.అనంతరం కార్యాలయం నుంచి ఎంపిడిఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ గా ఎంపిడిఓ సూర్యనారాయణ కు వినతిపత్రాన్ని అందించారు. వెంటనే ఓటీఎస్ ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, మండల కన్వీనర్ గోతులదోడ్డి ఉలిగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటపతి రాజు, తెలుగు యువత సురేష్ నాయుడు, తెలుగు యువత అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు టిపు సుల్తాన్, రామలింగ, కురువ విరేష్, నీలకఠ రెడ్డి, కురుగోడు, డాక్టర్ రాజానంద్, మంజుడేని,మైనార్టీ కార్యదర్శి రహ్మాన్,  ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, రాజాబాబు, సునీల్,తెలుగు యువత దుద్ది ఉసేని, నాగరాజు,రిశీ,శ్రీరాములు,అంజి,రామంజి,క్రిష్ణకాంత్,  తదితరులు పాల్గొన్నారు.

Related Posts