YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

మే 2నుంచి 7వరకు ఎంసెట్‌

మే 2నుంచి 7వరకు ఎంసెట్‌

-  షెడ్యూల్‌ స్వల్పంగా మార్చిన ఉన్నత విద్యామండలి 

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌-2018లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మే 2 నుంచి 6వ తేదీ వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఆన్‌లైన్‌ రాతపరీక్షలు మే 2 నుంచి 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మెన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ మే 2,3 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు ఎంసెట్‌ ఆన్‌లైన్‌ రాతపరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. మే 4,5,7 తేదీల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో రాతపరీక్షలుంటాయని చెప్పారు. మే 6న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఉన్నందున ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి ప్రవేశ పరీక్షలనూ నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రాతపరీక్షలు ముందుగా నిర్వహించే ఆనవాయితీ ఉందన్నారు. ఈ సంవత్సరం ముందుగా అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు రాతపరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. అందుకే మే 2,3 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు రాతపరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత, నీట్‌ రాసేందుకు సన్నద్ధమవుతారని అన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు మూడు విడతల్లో రాతపరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. మే 4,5,7 తేదీల్లో ఇంజినీరింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఐదు లేదా ఆరు విడతల్లో పరీక్షలు జరుపుతామని అన్నారు. నీట్‌ నేపథ్యంలో ఎంసెట్‌ రాతపరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయని చెప్పారు. ఈ అంశంపై బుధవారం ఎంసెట్‌, టీసీఎస్‌ అధికారులతో సమావేశమయ్యామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related Posts