YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

యాసంగి కోసం నానా తంటాలు

యాసంగి కోసం నానా తంటాలు

వరంగల్ జనవరి 31,
యాసంగిలోనూ స్వాగతం పలికాయి.. అన్నీ ముందే సిద్ధంచేశామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలే అయ్యాయి.. పంట రుణాలు అందక, పంట బీమాపై అవగాహన లేక సతమతమవుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ రబీ పంటకు సిద్ధమవుతున్నాడు. వరంగల్‌ జిల్లాలో పంట రుణాల మంజూరు ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నచందంగా ఉంది. అన్నదాతల పంట రుణాలపై ఘనంగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో అరకొరగా.. మరికొన్ని ప్రాంతాల్లో అసలే రుణాలు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్ రూరల్ జిల్లాకు 949 కోట్ల రూపాయల రుణాలు అవసరముంటే కేవలం 424 కోట్ల రూపాయాలు మాత్రమే రైతులకు మంజురయ్యాయి. ఇక వరంగల్ అర్భన్ జిల్లాలో 727 కోట్ల రూపాయాల రుణాలు రైతులకు ఇవ్వాల్సి వుండగా 328 కోట్లు మాత్రమే అందించారు. 50 శాతం రైతులకు రుణాలు మంజురే కాలేదు. మరోవైపు గతంలో తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకు అధికారులు కొత్త రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రబీ పంటకోసం రుణాలు ఇచ్చేందుకు తమను పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వమిచ్చే రుణాల కోసం ఆగితే రబీ పంట సమయం కూడ ముగిసిపోతుంది. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పడం లేదు. యాసంగి సాగుకోసం వడ్డీ వ్యాపారుల నిలువుదోపిడీ చేస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు రైతన్న గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. ఇక పంట బీమాపై ఏ మాత్రం తమకు అవగాహన లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతున్నా..అప్పుల ఊబిలో కూరుకుపోతూ వ్యవసాయం చేయాల్సి వస్తోందంటున్నారు. వరినాట్లు వేసేందుకు కూలీ ధరలు రెండింతలు పెరిగిపోయాయని.. ఇంతా చేస్తే తమకు మిగిలేది ఏమి లేదంటున్నారు. మరోవైపు రబీ పంట సాగుకోసం రైతులను అన్ని రకాలు ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమంపై రైతులకు అవగహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట రుణమాఫీతో పాటు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Related Posts