YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి ఎన్టీపీసీ విద్యుత్ సరఫరా నిలిపివేత

ఏపీకి ఎన్టీపీసీ  విద్యుత్ సరఫరా నిలిపివేత

విజయవాడ, ఫిబ్రవరి 10,
ఆంధ్రప్రదేశ్ లోని డిస్కంలు కేంద్రం సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌ కి 450 కోట్ల రూపాయల బకాయి పడ్డాయి. ఆ బకాయిలు చెల్లించాలంటూ ఇంతవరకు పదే పదే అడిగినా పట్టించుకోలేదు. చివరికి ఓ 30 కోట్లయినా చెల్లించాలని కోరింది. అయినా దున్నపోతు మీద వాన కురిసిన చందంగా వ్యవహరించాయి. దీంతో ఏపీకి విద్యుత్ సరఫరాను ఎన్టీపీసీ నిలిపేసింది. అప్పటికీ డిస్కంలకు కానీ, జగన్ రెడ్డి సర్కార్ కు కానీ దోమ కుట్టినట్లు కూడా లేకపోయింది. ఏపీలో విద్యుత్ కోతలు అమలు చేసింది. ఎన్టీపీసీకి పూర్తి బకాయిలు చెల్లించాలనే సోయి లేకుండా వ్యవహరిస్తోంది జగన్ రెడ్డి సర్కార్. దీంతో ఎన్టీపీసీ డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. తమకు పడిన బకాయి మొత్తం చెల్లించకపోతే దివాళా సంస్థలుగా డిస్కంలను ప్రకటిస్తామంటూ హెచ్చరించింది. ఫిబ్రవరి 20 లోగా మిగతా 450 కోట్ల బకాయి చెల్లించాలి.. లేదంటే ఆర్బీఐకి లేఖ రాస్తామని, దివాళా తీసినట్లు ప్రకటించాలని కోరతాం అంటూ డిస్కంల మెడపై కత్తి పెట్టింది ఎన్టీపీసీ.అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని విధానాలతో తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఏపీ సర్కార్. ఉత్పాదక రంగంపై కాకుండా రాజకీయ స్వార్థంతో ఖజానాలోని సొమ్మంతా కొందరికి అప్పనంగా దోచిపెట్టింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. పూర్తిగా పలు సంస్థలకు బకాయిలు పడింది. ఈ క్రమంలోనేపెద్ద మొత్తంలో ఎన్టీపీసీకి కూడా బకాయి పడింది. బకాయిలు చెల్లించకుండా మొండికేసిన ఏపీ డిస్కమ్ లపై ఎన్టీపీసీ కన్నెర్ర చేసింది. తమ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ కు సంబంధించి సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో వాటిని దివాళా తీసిన సంస్థలుగా ప్రకటింపజేస్తామని తాజాగాహెచ్చరించింది వాస్తవానికి డబ్బులు చెల్లించనందుకు ఇటీవల ఏపీకి రెండ్రోల పాటు ఎన్టీపీసీ ఆకస్మికంగా విద్యుత్ పంపిణీని నిలిపివేసింది. అంతటితో సరిపెట్టకుండా 2020లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి లేఖ రాస్తామని హెచ్చరిస్తూ వరుసగా లేఖలు రాసింది.ఇదే జరిగితే ఏపీ డిస్కమ్ లకు బహిరంగ మార్కెట్లో కూడా కరెంటు దొరకదు. పవర్ ఎక్స్ఛేంజీలోనూ కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉండదు. దీంతో రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారి సత్యనారాయణ ఎన్టీపీసీ యాజమాన్యంతో హడావుడిగా సంప్రదింపులు జరిపారు. ఎన్టీపీసీకి 3 వందల 30 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించింది. మరో 4 వందల 50 కోట్లను ఈ నెల 20వ తేదీలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఎన్టీపీసీ మెత్తబడి ఏపీకి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది. కానీ 20వ తేదీలోగా మొత్తం బకాయిలు చెల్లించకపోతే.. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేయడమే కాకుండా.. డిస్కమ్ లు దివాళా తీసినట్లు ప్రకటించాలని కోరుతూ ఆర్బీఐకి లేఖ రాస్తామని హెచ్చరించింది.2020 నాటి చట్టం ప్రకారం కేంద్రంలోని ఇంధన సంస్థలకు బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించాలి. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ సంస్థలకూ ఎప్పటికప్పుడు డిస్కమ్ లు బిల్లులు చెల్లించాలి. అలా చెల్లించకపోతే వాటిని దివాళా తీసినట్లుగా ప్రకటిస్తారనేది ఇక్కడ గమనించాల్సిన అంశం.

Related Posts