YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

రష్యా చర్యలపై భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

రష్యా చర్యలపై భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 26
ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే మొదటి నుంచి ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. కాగా, భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. అంతకుముందు ఐరాసలో భారతరాయబారి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భారత్‌ తీవ్ర ఆందోళనకు గురవుతున్నదని చెప్పారు. హింసను తక్షణమే నిలిపివేయడానికి తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపారు.

Related Posts