YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్

తెలంగాణ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్

హైదరాబాద్, మార్చి 3
వచ్చేసింది. ఆ సమయం రానే వచ్చేసింది. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ ఆర్ ఆర్ లు అడుగుపెట్టే గడియ వచ్చేసింది. బడ్జెట్ సెషన్ తో.. తొలిసారి కేసీఆర్, ఈటల రాజేందర్లు ఫేస్ టు ఫేస్ తలపడనున్నారు. సుదీర్ఘ కాలం.. దాదాపు 2 దశాబ్దాల కాలం.. కలిసి పని చేసి.. ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. అనేక ఎన్నికల్లో పోరాడి గెలిచి.. నిలిచిన.. ఆ ద్వయం.. తొలిసారి ద్వంద్వ యుద్ధానికి దిగబోతోంది. అందుకే ఈసారి తెలంగాణ సభాసమరం.. రంజుగా మారనుంది..అంటున్నారు.ఈటల రాజేందర్. మనిషి కొంచెమే అయినా.. గొంతు ఘనం. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ నుంచి.. ఉద్యమ వీరుడి వరకూ ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే. కేసీఆర్ చెంతనే ఉంటూ ఆయన తర్వాత ఈయనే అనేంత ఇమేజ్. అలాంటి ఈటలను ఒక్క రోజులోనే తొక్కేశారు కేసీఆర్. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి వేటేయడం.. పార్టీ వీడిపోయేలా చేయడం.. హుజురాబాద్ ఉప ఎన్నిక.. సర్వశక్తులూ ఒడ్డినా ఈటల గెలుపు అడ్డుకోలేకపోవడం.. ఇలా వరుస ఎదురుదెబ్బల తర్వాత.. ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టేందుకు రాజేందర్ సమాయత్తమవుతున్నారు. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి.. అధ్యక్షా.. అంటే చాలు.. కేసీఆర్ అహంకార మెడలు వంచినట్టే. గులాబీ బాస్ కు దారుణ పరాభవం జరిగినట్టే. ఆ సమయం, సందర్భం మరెంతో దూరంలో లేదు.. అసెంబ్లీ బెల్ మోగడం.. ఈటల సభలో కాషాయ కండువాతో అడుగుపెట్టడం.. అది చూసి కేసీఆర్ పరిస్థితి ఏంటి అంటున్నారు తెలంగాణ వాదులు. గోడకు కొట్టిన బంతిలా.. అసెంబ్లీకి దూసుకొస్తున్న ఈటల రాజేందర్ ను ఫేస్ చేయడం కేసీఆర్ తరం అవుతుందా? అనే చర్చ కూడా మొదలైంది. ఈటల మంచి వక్త. ఉద్యమకారుడు. దూకుడు స్వభావం ఉన్నోడు. పైగా ఏళ్లుగా కేసీఆర్ సహచరుడు. మంత్రి కూడా. ప్రభుత్వ లోటుపాట్లు, ముఖ్యమంత్రి అసలు నైజం పూర్తిగా తెలిసిన వాడు. అందుకే, రాజేందర్ ఒక్కో అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్ ను నిలదీస్తుంటే.. ఆహా.. ఆ సీన్ చూడాలని కోట్లాది మంది తెలుగువారు కోరుకుంటున్నారు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఈటలతో పాటు ఆర్ ఆర్ ఆర్ కాంబినేషన్ పై చాలా ఆసక్తి నెలకొంది. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు. ముగ్గురూ ముగ్గురే. త్రిబుల్ ధమాకా. ఎవరూ ఎందులో తగ్గేదేలే. బాగా నోరున్న ఆ ముగ్గురి కాషాయ దళం.. కేసీఆర్ పై సభలో గెరిల్లా దాడి చేయడం ఖాయమంటున్నారు. ప్రజల పక్షాన.. ప్రజా వాయిస్ ను.. అత్యంత బలంగా వినిపించడం.. కేసీఆర్ సర్కారును అడుగడుగునా కార్నర్ చేయడం.. అబ్బో ఊహించుకుంటుంటేనే తెలంగాణ అసెంబ్లీ ఎంత వాడివేడిగా జరుగుతుందో అర్థమైపోతోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ను బాగా సైడ్ చేసిన బీజేపీ.. ఇప్పుడిక సభలోనూ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం అంటున్నారు. అయితే, పొలిటికల్ మాస్టర్ మైండ్ కేసీఆర్.. ఆ ముగ్గురికీ అంత ఈజీగా ఛాన్స్ ఇస్తారా? తనను నిలదీసేందుకు మైక్ ఇస్తారా? ఏదో సాకు చూపి బహిష్కరణ వేటు వేసేస్తారా? చూడాలి ఏం జరగనుందో.

Related Posts