YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి

హైద‌రాబాద్ మార్చ్ 3
ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ ప‌థ‌కాలు అద్భుతంగా అమ‌ల‌వుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉద‌యం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మ‌హిళా బంధు కేసీఆర్ పేరిట సంబ‌రాలు నిర్వ‌హించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఇలా చేయ‌డం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది మ‌హిళ‌ల‌కు కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లైంద‌న్నారు.

Related Posts