YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ప్రైవేట్ బాటలో టీఆర్టీసీ కార్గో

ప్రైవేట్ బాటలో టీఆర్టీసీ కార్గో

హైదరాబాద్, మార్చి 26,
కార్గో, పార్సిల్‌‌‌‌ సర్వీస్ ప్రైవేట్‌‌‌‌కు అప్పగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కార్గో సర్వీసులకు ఆదరణ లేకపోడం, బుకింగ్స్‌‌‌‌ లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తోంది. ప్రారంభించి ఏడాది కాకముందే కార్గో బుకింగ్‌‌‌‌ సెంట్లర్లను ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌కు ఇస్తే తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు కోరుతూ కార్గో స్పెషల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ కృష్ణకాంత్‌‌‌‌ సర్కులర్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేశారు.140 కౌంటర్లలో బుకింగ్స్ అంతంతే 2019లో సమ్మె తర్వాత కార్గో సేవలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌‌‌‌ సూచించారు. చాలా ఆదాయం వస్తుందని, ఆర్టీసీ దిశ మారుతుందని చెప్పి తీసుకొచ్చారు. గతేడాది జూన్‌‌‌‌ 19వ తేదీన కార్గో, పార్సిల్‌‌‌‌ సర్వీసులు ప్రారంభించారు. కార్గో కోసం స్పెషల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ను నియమించారు. ప్యాసింజర్‌‌‌‌ బస్సులు తగ్గించడంతో ఖాళీగా ఉన్న సిబ్బందినే కార్గో సేవలకు వాడుకుంటున్నారు. సంస్థ పాత బస్సులను కూడా ఉయోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 177 బస్‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌లో సేవలు అందిస్తున్నారు. ఇప్పటి దాకా కార్గో ద్వారా 24.12 కోట్ల ఆదాయం వచ్చిందని, 24లక్షల పార్సిల్స్ రవాణాచేశామని సర్య్కులర్‌‌‌‌లో పేర్కొన్నారు. 177 బుకింగ్‌‌‌‌సెంటర్లలో 54 సెంటర్లు కంప్యూటరైజేషన్‌‌‌‌ చేశామని తెలిపారు. కానీ 140 సెంటర్లలో చాలా తక్కువ పార్సిల్స్‌‌‌‌ వస్తున్నాయని పేర్కొన్నారు. అంటే ఒకటి నుంచి 100 లోపు మాత్రమే పార్సిల్స్‌‌‌‌ వస్తున్నాయి. మిగతా 37సెంటర్లలో మాత్రమే ఆదరణ అంతంత మాత్రంగా ఉంది. ఆర్టీసీ కార్గోకు ప్రభుత్వంలోని అన్ని విభాగాల నుంచి సరకు రవాణా ఆర్డర్లు చేస్తారని, దీంతో మస్తు ఆదాయం వస్తుందని అధికారులు ప్రగల్భాలు పలికారు. కానీ ఒక్కటి రెండు డిపార్ట్‌‌‌‌మెంట్లు మినహా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్లు రాలేదు. కార్గో కోసం ప్రత్యేకంగా బస్సులను మోడిఫై చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి, కంప్యూటర్లు, ఫర్నిచర్‌‌‌‌ కొనుగోలు చేశారు.బుకింగ్‌‌‌‌ సెంటర్లకు ఆదరణ లేకపోవడంతో ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కార్గోకు వాడుకుంటున్న ఆర్టీసీ సిబ్బందిని డ్యూటీల నుంచి తప్పించి కండక్టర్లు, డ్రైవర్లుగా వాడుకుంటామని అధికారులు అంటున్నాయి. అయితే బస్సులే ఎక్కువగా నడవడంలేదని, వీరిని ఏం చేస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఆదరణ లేదని చెబుతున్న140 సెంటర్లను ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ ఏజెన్సీకి ఇవ్వనున్నారు. ఒకరిద్దరు ఎంప్లాయీస్‌‌‌‌ను కాకుండా మొత్తానికి మొత్తంగా వారికే అప్పజెప్పనున్నారు. అయితే మిగతా 37 సెంటర్లలో మాత్రం ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ చొప్పున అవసరం ఉన్న ఒకరిద్దరిని హెల్పర్‌‌‌‌గా వాడుకోనున్నారు.బుకింగ్‌‌‌‌ సెంటర్లు ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌కు అప్పగించేందుకు కమిటీలు వేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కమిటీలో డీవీఎం, డీఎం, ఏవో ఉంటారు. ‘‘బుకింగ్‌‌‌‌ సెంటర్లు కార్పొరేషన్‌‌‌‌ ప్రాంగణాల్లో ఉన్నాయి. వీటిని ఓపెన్‌‌‌‌ స్పేస్‌‌‌‌లో మాత్రమే చేయగలుతామా? ఒక వేళ ఎవరైనా నడుపుతామని వస్తే వాళ్లకు ఇచ్చేద్దామా? వారికి స్పేస్‌‌‌‌ ఇస్తే రెంట్‌‌‌‌ చెల్లిస్తారా? ఇప్పటికే ఉన్న స్టాల్స్‌‌‌‌ ఓనర్లకు అప్పజెబుదామా?’’ అనే పలు ప్రశ్నలపై స్టడీ చేయాలని ఆదేశించారు. ఏంచేస్తే బాగుంటుందో నాలుగు రోజుల్లో సలహాలు, సూచనలతో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని సూచించారు. ఏపీలో సేమ్ కార్గో సర్వీస్ ప్రారంభించారు. అయితే సొంతంగా మ్యాన్‌‌‌‌ పవర్‌‌‌‌ పెట్టుకుని నడపవడంతో గిట్టుబాటుకాలేదు. ఒక్కో ఎంప్లాయ్‌‌‌‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల జీతం ఉంది. వచ్చే ఆదాయానికి, పెట్టే ఖర్చుకు పొంతనలేకుండా పోయింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అయింది. ఏపీలో విఫలమైందని తెలిసినా హడావుడిగా, గొప్పలు చెప్పుకొంటూ తెలంగాణలో కార్గోను తీసుకొచ్చారు. అక్కడ సర్వీసులు కనీసం సర్వే చేయకుండా, లెక్కలు తీయకుండా, లాభనష్టలు భేరీజు వేయకుండా హడావుడిగా కార్గో సేవలు ప్రారంభించారు. ఆర్టీసీలో బస్సులు తగ్గించడంతో ఖాళీగా ఉన్న ఉద్యోగులను వాడుకొని, లాభాల్లో ఉందని చూపెట్టే ప్రయత్నం చేశారు. బూమ్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశారు. డీజిల్‌‌‌‌, బస్సులు, ఎంప్లాయీస్‌‌‌‌ జీతాలు పోగా నష్టాలే వస్తున్నాయనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు జనాదరణ లేకపోవడంతో ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌కు ఇవ్వాలని నిర్ణయించారు

Related Posts