YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

తమిళనాడుకు వెళ్లిపోయిన లులూ గ్రూప్

తమిళనాడుకు వెళ్లిపోయిన లులూ గ్రూప్

విజయవాడ, మార్చి 30,
దుబాయ్‌కి చెందిన ప్రముఖ లులూ గ్రూపు సంస్థ తమిళనాడులో మూడు ప్రాజెక్టులను చేపట్టే దిశగా రూ.3500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే రెండు మాల్స్, రూ.1000 కోట్ల పెట్టుబాడితో ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్, ఉన్నాయని, తమిళనాడు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం లులూ గ్రూపుతో చేసుకున్న ఒప్పందం వలన పెట్టుబడులతో  పాటుగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని, అందుకు సమబందించిన వివరాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, నిజానికి ప్రాజెక్ట్, ఈ పెట్టుబడులు ఏపీకి వచ్చి, వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వలన వెనక్కి వెళ్ళాయి. అదీ బాధాక‌రం. అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం లులూ గ్రూపుతో  2017-18లోనే ఇంచు మించుగా ఇదే మొత్తంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జరిపిన చర్చల ఫలితంగా లులూ గ్రూపు విశాఖలో భారీ వాణిజ్య సముదాయం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీతమ్మధార ప్రాంతంలో 13.38 ఎకరాల భూమిని కేటయించింది. అయితే పనులు ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగి పోయాయి. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. జ‌గ‌న్‌ ప్రభుత్వం కొలువు తీరింది మొదలు, భూ దందాకు తలుపులు తీసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు చూపుతో, లులూ గ్రూపుకు కేటాయించిన భూమిని, వైసీపీ ప్రభుత్వం కుంటిసాకులు చూపించి వెనక్కి తీసుకుంది. దీంతో లులూ గ్రూపు, మీకో దండం, మీ ప్రభుత్వానికో దండం అని చెప్పి, ఇక ఎప్పటికీ ఏపీలో పెట్టుబడులు పెట్టేది లేదని, చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. నిజానికి అప్పట్లో, ఈ విషయంగా చాలా పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ప్రభుత్వం, లులూ ప్రాజెక్ట్ అటకెక్కటానికి భూవివాదం, పర్యావరణ సమస్యలు కారణమని పేర్కొంది. కానీ, అవి కుంటి సాకులు మాత్రమే అని, లులూ గ్రూప్  అప్పుడే ఆధారాలతో సహా స్పష్టం చేసింది. ఆలాగే, వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులకు,  లులూ గ్రూప్’కు వ్యతిరేకం కాదని, గత తెలుగు దేశం ప్రభుత్వం భూమి కేటాయింపుకు అనుసరించిన విధానాలకు మాత్రమే వ్యతిరేకమని, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, లులూ గ్రూప్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, రూ 2,200-కోట్ల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసిన లులూ గ్రూప్’ యాజమాన్యం తెలుగుదేశం ప్రభుత్వం చాలా చక్కగా, పారదర్శకంగా ఒప్పందం కుదుర్చుకుందని స్పష్టం చేసింది. అదలా ఉంటే వైసేపీ ప్రభుత్వం, లులూ గ్రూపు ఒప్పందానికి ఏ నిబంధనలు అయితే, అడ్డుగా పేర్కొందో, ఆ నిబంధనలు అన్నిటినీ  తుంగలో తొక్కి, అదే 13.38ఎ కరాల భూమిని, నివాస/వాణిజ్య నిర్మాణాలకు అనువుగా అభివృద్ధి చేసి, బిల్డ్ ఏపీ మిషన్ పేరిట, వాణిజ్య సదుపాయాల నిర్మానానికి  విక్రయించాలని నిర్ణయించింది. అసలు ఈ గోల్ మాల్ కోసమే, వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి లులూ గ్రూప్’ ను రాష్ట్రం  నుంచి తరిమి వేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి వైసేపీ ప్రభుత్వం నిర్వాకం వలన రాష్ట్రం నుంచి వెళ్లి పోయింది ఒక్క లులూ పెట్టుబడులు మాత్రమే కాదు, చెప్పుకుంటే కొండవీటి చెంతాడంత చిట్టా బయటకు వస్తుందని నిపుణులు అంటున్నారు.

Related Posts