YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మళ్లీ హస్తినకు కేసీఆర్

మళ్లీ హస్తినకు కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 16,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగ్గేదేలే అంటున్నారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని పోరును మరింత ఉధృతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు గులాబీ దళపతి. మొన్నటికి మొన్న వరివార్‌పై ఢిల్లీలో సమరశంఖం పూరించిన ముఖ్యమంత్రి.. మరోసారి హస్తిన టూర్‌కు సమాయత్తమవుతున్నారు. కాషాయం పార్టీపై పోరులో భాగంగా మరో రెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం కేసీఆర్‌. ఈసారి వారం రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. పర్యటనలో భాగంగా రైతు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కొత్త వ్యవసాయ పాలసీలు, చట్టాలపై చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్‌ వెళ్లనున్నారు. లఖింపూర్‌ ఖేరీ హింసాకాండలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు కుటుంబాలకు సాయం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని గతంలోనే ప్రకటించారు కేసీఆర్‌. ఇప్పుడీ మాటను నిలబెట్టుకునేందుకు డిల్లీతో పాటు యూపీకి కేసీఆర్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.కాగా తెలంగాణలో పండిన వరిని కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌ ఉద్యమిస్తు్న్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్‌ నాయకత్వంలో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దీక్షకు కూడా ఉపక్రమించారు. రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి
మరో వైపు కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారువ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు.ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల ఏకాభిప్రాయం సాధించి, ప్రతిపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకోవాలని ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏప్రిల్ నెలాఖరు నుంచి పలు రాష్ట్రాల్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై ఆయన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎంలతో చర్చించనున్నారు.ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు 9,194 ఓట్లు తక్కువ ఉన్నాయి. జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే.. బీజేపీ గెలుపుకు తిరుగులేదు. కానీ, బీజేపీకి మద్దతు తెలపొద్దని ప్రతిపక్ష కూటమి ఆ రెండు పార్టీల్ని ఒప్పించగలిగితే మాత్రం.. రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే, కనీసం గట్టి పోటీ ఇచ్చినట్లైనా ఉంటుంది. మరి, కేసీఆర్ రచిస్తున్న వ్యూహం విజయవంతం అవుతుందా? లేదా? ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే! ఒకవేళ కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజెపీకి చెక్ పెడితే మాత్రం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో బీజేపీకి ముచ్చెమటలు పట్టించే అవకాశం వుంది.ప్రస్తుతం బీజేపీ లేదా దాని కూటమి మొత్తం 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 శాసనసభ్యులతో నిర్మితమైన కలెక్టొరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కలెక్టోరల్ కాలేజ్ లో మొత్తం 1,098,903 ఓట్లు ఉన్నాయి. 6,264 ఓట్లు కలిగిన జమ్ము & కాశ్మీర్ సస్పెండ్ అవ్వడంతో.. బీజేపీ మెజారిటీ 5,46,320 ఓట్లకి పడిపోయింది. బీజేపీ ఖాతాలో మొత్తం 4,65,797 ఓట్లు ఉండగా, దాని కూటమి 71,329 ఓట్లు కలిగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీకి మరో 9,194 ఓట్లు కావాలి.

Related Posts