YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

విద్య ,ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత మంత్రి సత్యవతి రాథోడ్

విద్య ,ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత మంత్రి సత్యవతి రాథోడ్

జయశంకర్ భూపాలపల్లి ఏప్రిల్ 25
రాష్ట్ర ప్రభుత్వం విద్య ,ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రూప్స్, ఎస్‌.ఐ, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు ,నియామకాలు కోసం అన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ మొదటిసారిగా ఒకేసారి 80 వేల ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చింది.ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సమితి చైర్మన్ వాసుదేవ రెడ్డి ఉన్నారు.

Related Posts