YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

శ్రీ లంకకు 5 బిలియన్ డాలర్లు

శ్రీ లంకకు 5 బిలియన్ డాలర్లు

కొలంబో, జూన్ 8,
సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో పరిస్థితులు చక్కబడాలంటే రాబోయే ఆరు నెలలకు గాను 5 బిలియన్ డాలర్లు అవసరమని ప్రధానమంత్రి రణిల్ విక్రమ్ సింఘే అన్నారు. వీటిలో 3.3 బిలియన్ డాలర్లు ఇంధన ఎగుమతులకు, మిగతావి ఆహార అవసరాలకు కావాలని పార్లమెంటులో చెప్పారు. 2022 లో ఆర్థిక వ్యవస్థ 3.5శాతం తగ్గుతుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసిందని.... అయితే బలమైన సంస్కరణ ప్యాకేజీ, రుణ పునర్నిర్మాణం, అంతర్జాతీయ మద్దతుతో వృద్ధి తిరిగి రాగలదని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం మాత్రమే సరిపోదని, మొత్తం ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలని తెలిపారు. మధ్యంతర బడ్జెట్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని, 2023 చివరికల్లా ఆర్థిక స్థిరత్వాన్ని అందుకోవాల్సిన అవసరముందని అన్నారు.చైనా, భారత్‌తో పాటు జపాన్ వంటి దేశాల సహాయంతో పాటు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన రుణ ప్యాకేజీకి చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా యూరియా ఎగుమతుల కోసం 55 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే సీజన్‌లో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేబినెట్ ప్రతినిధి బందులా గుణవర్ధనే చెప్పారు. ఐక్యరాజ్య సమితి కూడా బుధవారం శ్రీలంకకు ఆహారం, వ్యవసాయం, వైద్య సహాయాన్ని అందించాలని ప్రపంచ దేశాలను కోరనున్నట్లు తెలిపింది.

Related Posts