YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లావు.... మరో రఘురాముడా..

లావు.... మరో రఘురాముడా..

గుంటూరు, జూలై 29,
వైసీపీ అధినేత గుప్పిట మూసి ఉంచాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఈ మూడేళ్లు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అన్నట్లు వైసీపీలో తిరుగుబాట  పడుతున్న నేతల సంఖ్య  రోజురోజుకూ పెరిగిపోతున్నాది. నిన్నటి వరకూ వైసీపీకి పక్కలో బల్లెంగా రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు ఒక్కరే ఉండే వారు. ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. అధినేత మాటే శాసనం అన్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.గడప గడపకూ మన ప్రభుత్వం విషయంలో అదినేత ఆదేశాలను పాటిస్తున్న వారి సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఆ విషయాన్ని జగనే స్వయంగా సమీక్షల్లో వెల్లడించారు. పదిపదిహేను మంతి ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారెవరూ గడప గడపకూను సీరియస్ గా తీసుకోవడం లేదని జగన్ ఫైరైన సంగతి విదితమే. ఇక ఇప్పుడు వైసీపీలో లుకలుకలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల స్థాయి దాటి హస్తినకు సైతం పాకాయి. వైసీపీలో అసమ్మతి భగ్గు మంటున్నదన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ వైసీపీలో అసమ్మతి, అసంతృప్తి రాష్ట్రం ఎల్లలు దాటి బయటకు కనబడ లేదు. రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇందుకు మినహాయింపు అది వేరే సంగతి. తాజాగా వైసీపీ ఎంపి లావు కృష్ణ దేవరాయలు తన అసంతృప్తిని, ధిక్కారాన్ని కొత్త పద్ధతిలో వెల్లగక్కారు. వైసీపీ అధినేత తీరు పట్ల, ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల తన అసమ్మతిని విపక్ష తెలుగుదేశం ఎంపీలతో చనువుగా మెలగడం ద్వారా తెలియజేశారు.ఈ మూడేళ్ళుగా వైపీసీ ఎంపీలలో రఘురామ కృష్ణం రాజు మినహా మరెవరూ పార్టీ కట్టుబాట్లను దాటిన దాఖలాలు లేవు. ఆ కట్టుబాట్లేమిటంటే తెలుగుదేశం ఎంపీలతో కలవకూడదు. వారితో కలవాలంటే ముందుగా అధినేత జగన్ అనుమతి ఉండాలి. అసలివన్నీ ఎందుకు తెలుగుదేశం వారంటే వ్యక్తిగతంగా శత్రువులే అన్నట్లు వ్యవహరించాలి.ఇది వైసీపీ ఎంపీలకు ఒక లక్మణరేఖ. అది దాటడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కానీ లావు కృష్ణ దేవరాయులు మాత్రం వాటన్నిటినీ బేఖాతరు చేసి తెలుగుదేశం ఎంపీలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి విందు సమావేశాల్లో పాల్గొంటున్నారు.  లావు శ్రీకృష్ణదేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం టీడీపీ ఎంపీల‌తో క‌లిసి క‌నిపించారు.   టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి  నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కేశినేని, గ‌ల్లా జ‌య‌దేవ్‌, కింజ‌రాపు రామ్ మోహ‌న్ నాయుడులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొంత మంది యువ ఎంపీలు కూడా ఉన్నారు.టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావుల‌తో పాటు డీఎంకేకు   ఎంపీ  క‌నిమొళి, త‌మిజాచ్చి తంగ‌పాండియ‌న్‌, క‌థిర్ ఆనంద్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివ‌సేన ఎంపీ ధైర్యశీల్ మానే త‌దిత‌రులు కూడా ఉన్నారు. వారందరికీ కేశినేని నాని విందు ఇచ్చారు. అయితే లావు శ్రీకృష్ణ దేవరాయులుకు వైసీపీలో ఎటువంటి ప్రాధాన్యతా గుర్తింపు లేకపోవడం వల్లనే ఆయన గీత దాటుతున్నారనీ, పక్క చూపులు చూస్తున్నారనీ వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీలో వస్తున్న మార్పునకు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం ఎంపీలతో సన్నిహితంగా మెలగడం ఒక నిదర్శనంగా చెప్పవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

Related Posts