YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భారత్, బ్రిటన్ ప్రధానుల భేటీ

భారత్, బ్రిటన్ ప్రధానుల భేటీ

లండన్, అక్టోబరు 29, 
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు భేటీ వచ్చే నెలలో బేటీ కానున్నారు. వీరిరువురి మధ్యా భేటీ ఖరారైంది. ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాధినేతల భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇంతకీ వీరి భేటీ ఎక్కడంటే... వచ్చే నెల బాలి వేదికగా జరగనున్న జ20 లీడర్ షిప్ సమ్మిట్ కు ఇరువురూ హాజరు కానున్నారు.  ఈ సమ్మిట్ లో భాగంగా ఇరువురు నేతలూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని,  ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారని పేర్కొంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ   ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని మోడీ రిషి సునాక్ దృష్టికి తీసుకువెళ్లారు. రిషీ సునాక్ హయాంలో భారత్, బ్రిటన్ ల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.

Related Posts