YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ గూటికి ముద్రగడ పద్మనాభం

వైసీపీ గూటికి ముద్రగడ పద్మనాభం

కాకినాడ, డిసెంబర్ 2,
గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్‌ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్‌ అయ్యారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడులో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ సీట్‌ ఆఫర్‌ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ ఉద్యమానికి సైతం గుడ్‌బై చెప్పారు ముద్రగడ. 2014, 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా.. ఎటూ వెళ్లలేదు. కానీ.. త్వరలో వైసీపీ కండువా కప్పుకొంటారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.అధికార వైసీపీ నేతలు ముద్రగడను ఫ్యాన్‌ గాలి కింద కూర్చోబెట్టేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నట్టు టాక్‌. అయితే సీట్ల దగ్గర పంచాయితీ తేలడం లేదని తెలుస్తోంది. ముద్రగడను ప్రత్తిపాడు ఎమ్మెల్యే లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చిందట. అయితే ఆ రెండింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తాను బతికుండగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని.. ఒకవేళ బరిలో ఉండాల్సి వస్తే.. పార్లమెంట్‌ సీటుపైనా ఆసక్తి లేదని.. అసెంబ్లీకి అయితే ఒకే అని ముద్రగడ చెప్పినట్టుగా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉభయగోదావరి జిల్లాల వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ రాయబారం నడుపుతున్నట్టు తెలుస్తోంది.జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. పవన్‌ పిఠాపురాన్ని ఎంచుకుంటే..ఆయనపై ముద్రగడను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనా ఉందట. గెలుపోటములు ఎలా ఉన్నా.. పిఠాపురంలో సేనానికి టఫ్ ఫైట్‌ ఇస్తే మిగతా చోట్లా ఆ ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయట. కాకినాడ పార్లమెంట్ పరిధిని కాపు సామాజికవర్గం ఓటర్లు ప్రభావితం చేస్తారు. ఆ సమీకరణాలకు తగ్గట్టుగానే అధికారపార్టీ అడుగులు వేస్తోందట. పిఠాపురం కాకపోతే మరో ఆప్షన్‌గా పెద్దాపురంను కూడా వైసీపీ పరిశీలిస్తోందట. వైసీపీ ఇంత వరకు పెద్దాపురంలో బోణీ కొట్టలేదు. పిఠాపురం, పెద్దాపురం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో.. అడుగులు ముందుకు పడొచ్చని అనుకుంటున్నారు. అయితే ప్రత్తిపాడు సీటును తన ఫ్యామిలీకి వదిలేయాలని ప్రతిపాదన ముద్రగడ నుంచి వెళ్లినట్టు టాక్‌. దానిపై వైసీపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు చెబుతున్నారు.ఒకే పార్లమెంట్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి సీట్లు ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో ఆరా తీసే పనిలో పడ్డారట. రెండుచోట్లా పోటీ చేస్తే ఎక్కడా పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ పెట్టే అవకాశం ఉండబోదనే అభిప్రాయం వ్యక్తం అవుతోందట. ఫస్ట్ మీరు కానీయండి.. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవితో ఆ గ్యాప్‌ పూరుస్తామని ముద్రగడకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దాయన మాత్రం అది సెట్ చేస్తేనే ఇది సెట్‌ అవుతుందని స్పష్టం చేశారనే వాదన ఉంది. ఈ ఎపిసోడ్‌ను కొలిక్కి తెచ్చేందుకు పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత సర్వేలు చేయిస్తోందట. బరిలో ఎవరు ఉంటే వర్కవుట్ అవుతుంది… పార్టీ ప్రభావం ఏ మేర ఉంటుంది… వ్యక్తిగత మైలేజ్‌ ఏ మాత్రం కలిసి వస్తుంది అనే వివరాలు సేకరిస్తున్నారట. ఆ సర్వేలో వచ్చిన ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.తుని రైలు దహనం కేసులో ముద్రగడ కోర్టు వాయిదాల కోసం విజయవాడ వెళ్తున్నారు. ఆ సమయంలోనూ కొందరు వైసీపీ నేతలతో ఆయన టచ్‌లో ఉంటున్నారట. ఇంకోవైపు.. ముద్రగడ ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన అనుచరుల్లో చాలా మంది టీడీపీలోకి వెళ్లిపోయారు. వారిని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో ముద్రగడను బీజేపీ పెద్దలు కలిశారు. పదవులు సైతం పందేరం వేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎలాగూ జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేనందున.. ఆ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీలోకి వెళ్తే.. అటు సామాజికవర్గ పరంగా.. ఇటు పదవుల పరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు కదా అని.. పెద్దాయనకు చెబితే.. తనకు ఆ ఆలోచన లేదని నవ్వి ఊరుకున్నారట. మరి.. అధికార వైసీపీ తాజాగా ఇచ్చిన ఆఫర్లపై ముద్రగడ ఎలా స్పందిస్తారో? ఏం చేస్తారో చూడాలి.

Related Posts