YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

డొనాల్డ్ ట్రంప్పై గ్రాండ్ జ్యూరీ అభియోగాలు

డొనాల్డ్ ట్రంప్పై గ్రాండ్ జ్యూరీ అభియోగాలు

న్యూయార్క్,  ఏప్రిల్ 1, 
'స్టార్మీ డేనియల్స్'.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన పేరు ఇది. ఈమె వల్లే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అక్కడి గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. త్వరలోనే ఆయనపై క్రిమినల్ ఛార్జీలు పడనున్నాయి. మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ ఛార్జీలు పడిన తొలి వ్యక్తిగా ట్రంప్ నిలిచిపోనున్నారు. అసలు ఎవరీ స్టార్మీ డేనియల్స్? ఈ పోర్న్ స్టార్కు ట్రంప్నకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీరి మధ్య వివాదానికి గల కారణాలేంటి?
స్టార్నీ డేనియల్స్.. అడల్ట్ ఫిల్మ్ స్టార్..
ప్రముఖ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్.. 2018లో సీబీఎస్ ఛానెల్కు చెందిన '60 మినిట్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2006లో తాను ట్రంప్తో లైంగికంగా కలిసినట్టు ఆమె తెలిపారు. ఇది ట్రంప్ మూడో పెళ్లి (మిలానియా) జరిగిన ఏడాది అనంతర ఘటన! సరిగ్గా ఇక్కడి నుంచి దశాబ్ద కాలం తర్వాత డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడయ్యారు.అయితే.. తనకు స్టార్నీ డేనియల్స్తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్.. ఆమెకు డబ్బులు ఇచ్చిన మాత్రం విషయాన్ని అంగీకరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండేందుకే డబ్బులు ఇచ్చినట్టు వివరించారు.డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్. అమె వయస్సు 44ఏళ్లు. ఆమె.. లూసియానాలోని బాటన్ రోగ్లో నివాసముంటున్నారు. రెండు దశాబ్దాల పాటు అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అనేక వీడియోలు కనిపించారు. పలు వీడియోలకు దర్శకత్వం కూడా వహించారు. 2006లో ట్రంప్తో తనకు తొలిసారి పరిచయం ఏర్పడిందని స్టార్నీ డేనియల్స్ తెలిపారు. లేక్ టహౌలో జరిగిన ఓ సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో ట్రంప్ను కలిసినట్టు వివరించారు. ఆ తర్వాత.. ట్రంప్ తన హోటల్లో డిన్నర్కు ఆహ్వానించినట్టు స్పష్టం చేశారు.కొన్ని రోజుల తర్వాత తాను ట్రంప్ హోటల్ గదికి వెళ్లినట్టు అంగీకరించారు స్టార్మీ డేనియల్స్. 'సెలబ్రిటీ అప్రెంటీస్' అనే ప్రముఖ టీవీ షోలోకి వస్తావా? అని ట్రంప్ తనను అడిగినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరు.. ఏకాభిప్రాయంతో సెక్స్ చేసినట్టు వివరించారు.ఈ ఘటన తర్వాత ట్రంప్.. తనకు పలుమార్లు ఫోన్ చేసినట్టు స్టార్మీ డేనియల్స్ వెల్లడించారు.  "2006 తర్వాత మేము చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాము. 2007 జులైలో లాస్ ఏంజెల్స్ బేవరలీ హిల్స్ హోటల్లో మళ్లీ కలిశాము. టీవీషోలో కనిపించడంపై చర్చిద్దాం అని ట్రంప్ నన్ను పిలిచారు. కానీ నాతో సెక్స్ కావాలన్నారు. నేను ఒప్పుకోలేదు. అది జరిగిన నెల తర్వాత నాకు ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది. టీవీషోలో కనిపించేందుకు అవకాశం లేదన్నారు," అని స్టార్మీ డేనియల్స్ వెల్లడించారు.లాస్ ఎంజెల్స్ ఫెడరల్ కోర్ట్లో దాఖలైన పత్రాల ప్రకారం.. 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు  స్టార్మీ డేనియల్స్తో ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. తనతో సంబంధం గురించి బహిరంగంగా చెప్పకూడదని ఆ ఒప్పందంలో ఉంది. ఇందుకోసం 1,30,000 డాలర్లు చెల్లించారు ట్రంప్. ఈ ఒప్పందంపై స్టార్మీ డేనియల్స్ లాయర్ కైత్ డేవిడ్సన్, ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది- ఫిక్సర్ మైకెల్ కోహెన్ సంతకాలు చేశారు. ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉన్నా.. ఆయన ఎప్పుడు చేయలేదని తెలుస్తోంది.2018లో ఈ ఒప్పందం గుప్పుమంది. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాలు ప్రచురించింది. స్టార్మీ డేనియల్స్కు డొనాల్డ్ ట్రంప్ పేమెంట్స్ చేశారని రాసుకొచ్చింది. ఈ విషయంపై కోహెన్ బహిరంగంగా స్పందించారు. ఈ ఒప్పందంతో ట్రంప్నకు ఎలాంటి సంబంధం లేదని, తానే తన సొంత డబ్బులు చెల్లించినట్టు వివరించారు. అనంతరం ట్రంప్, కోహెన్పై స్టార్మీ కేసు వేశారు. ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ట్రంప్ ఈ ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేయలేదు కాబట్టి.. దీనిని అమలు చేసేందుకు తాము ఒత్తిడి తీసుకురామని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. ఫలితంగా.. సమస్య పరిష్కారమైందంటు.. న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేశారు.2018లో ట్రంప్- స్టార్మీ మధ్య 'బంధం' మరింత ఉద్రిక్తంగా మారింది. ట్రంప్ తనతో సెక్స్ చేసిన విషయాన్ని బహిరంగంగా చెప్పినందుకు.. తనకు బెదిరింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పోర్న్ స్టార్. దీనిని ట్రంప్ ఖండించారు. తనను మోసం చేసి, డబ్బులు పొందాలన్న కారణంతోనే స్టార్మీ అలా మాట్లాడుతున్నారని ట్వీట్ చేశారు ట్రంప్. ఈ ట్వీట్ ఆధారంగా.. మాజీ అధ్యక్షుడిపై పరువు నష్టం దావా వేశారు డేనియల్స్. అయితే.. ట్రంప్ వ్యాఖ్యలు కించపరిచే విధంగా లేవని, ఫ్రీ స్పీచ్ హక్కుల్లో భాగంగానే ఉన్నాయని ఓ జడ్జీ తీర్పునిచ్చారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా అమెరికా సూప్రీంకోర్టుకు వెళ్లారు స్టార్మీ డేనియల్స్. కాగా.. అక్కడ కూడా ఆమెకు పరాజయం తప్పలేదు.కాగా.. డేనియల్స్కు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలు మాత్రం మాజీ అధ్యక్షుడిని వెంటాడాయి. ఆ విషయంపై దాఖలైన కేసులో తాజాగా.. న్యూయార్క్లోని గ్రాండ్ జ్యూరీ ఆయనపై అభియోగాలు మోపింది.

Related Posts