YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

సెక్స్ సీన్ లో భగవద్గీత

సెక్స్ సీన్ లో భగవద్గీత

న్యూయార్క్, జూలై 24, 
క్రిస్టఫర్ నోలాన్ మరో అద్భుత సృష్టి ఓపెన్హైమర్.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళుతోంది. అయితే.. ఇండియాలో మాత్రం ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. కారణం ఏంటంటే..
"ఓపెన్హైమర్".. సినీ ప్రపంచంలో ఈ సినిమా ఇప్పుడొక హాట్ టాపిక్. దిగ్గజ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ మరో అద్భుత సృష్టిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది ఈ మూవీ. అయితే.. ఇండియాలో మాత్రం ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. సినిమాలోని ఓ సెక్స్ సీన్లో భగవద్గీత కనిపించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆటమ్ బాంబ్ను తయారు చేసిన రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు క్రిస్టఫర్ నోలాన్. ఇందులో హీరోగా ప్రముఖ హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ నటించారు. అయితే ఓ సీన్లో.. ఓపెన్హైమర్ సెక్స్ చేస్తూ, భగవద్గీత చదువుతున్నట్టు కనిపించిందని తెలుస్తోంది! ఇది ఇండియాలో చాలా మందికి నచ్చలేదు. సోషల్ మీడియాలో దీనిపై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. "సెక్స్ చేస్తుండగా.. ఓ మహిళ, ఓ పురుషుడి చేత భగద్గీత చదివిస్తుంది. ఈ సీన్ ఓపెన్హైమర్ సినిమాలో ఉంది. దీనిపై కేంద్ర సమాచారశాఖ అత్యవసరంగా దర్యాప్తు చేపట్టాలి. దీనిని తెరకెక్కించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి," అని సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది."సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఈ సీన్ని ఎందుకు తొలగించలేదు? ఈ సీన్తో సినిమాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు?" అని సంబంధిత ఫౌండేషన్ మండిపడింది.టెనెంట్, ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు క్రిస్టఫర్ నోలాన్. అయితే.. ఆయన చేసిన ఓపెన్హైమర్కు 'ఆర్' రేటింగ్ సర్టిఫికేట్ దక్కింది. నోలాన్ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా.. ఇండియాలో మాత్రం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. పలు నివేదికల ప్రకారం.. చాలా సీన్లను సినీ బృందం స్వయంగా కట్ చేసింది. ఇండియాలో ఎలాగో వాటిని సెన్సార్ బోర్డు ఆమోదించదని భావించే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా.. తాజా వివాదంతో సెన్సార్ బోర్డుపైనా విమర్శలు ఎదురవుతున్నాయి. మరి దీనిపై సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.ఇక ఓపెన్హైమర్ విషయానికొస్తే.. ఈ సినిమా జులై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వారాతం ముగిసే సరికి ఈ చిత్రానికి 165మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో తొలి రెండు రోజులు ఈ సినిమా రూ. 31 కోట్లను వసూలు చేసుకుంది.

Related Posts